షాకింగ్ న్యూస్: సెక్స్ ద్వారా డెంగీ వ్యాప్తి..

డెంగీ..ప్రస్తుతం ఈ వ్యాధి దేశవ్యాప్తంగా ఎంతో ప్రమాదకరంగా తయారైంది. ముఖ్యంగా డెంగీ తెలుగు రాష్ట్రాలపై పగబట్టింది. ఇటీవలే ఖమ్మంలో డెంగీతో.. మహిళా జడ్జి తనువు చాలించగా..కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబాన్నే ఈ మాయదారి రోగం కబళించింది. ఏడాదికి..ఏడాదికి డెంగీ మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఏడిస్  ఈజిప్టై అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే  వైరస్ వల్ల వచ్చేది డెంగీ జ్వరం. ఇది చాలామందికి […]

షాకింగ్ న్యూస్: సెక్స్ ద్వారా డెంగీ వ్యాప్తి..
Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 25, 2021 | 6:16 PM

డెంగీ..ప్రస్తుతం ఈ వ్యాధి దేశవ్యాప్తంగా ఎంతో ప్రమాదకరంగా తయారైంది. ముఖ్యంగా డెంగీ తెలుగు రాష్ట్రాలపై పగబట్టింది. ఇటీవలే ఖమ్మంలో డెంగీతో.. మహిళా జడ్జి తనువు చాలించగా..కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబాన్నే ఈ మాయదారి రోగం కబళించింది. ఏడాదికి..ఏడాదికి డెంగీ మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఏడిస్  ఈజిప్టై అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే  వైరస్ వల్ల వచ్చేది డెంగీ జ్వరం. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే డెంగీ వ్యాప్తి విషయంలో..తాజాగా డాక్టర్లు, పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు.  స్వలింగ సంపర్కం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి డెంగీ వ్యాపిస్తుందన్న విషయాన్ని స్పెయిన్ వైద్యులు రివీల్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మాడ్రిడ్‌ నగరానికి చెందిన ఓ 41 ఏండ్ల స్వలింగ సంపర్కుడు.. డెంగీ సోకిన మరో వ్యక్తితో కలిసి శృంగారంలో  పాల్గొనడంతో అతనికి కూడా ఆ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. కాగా ప్రస్తుతం డెంగీతో బాధపడుతోన్న వ్యక్తి..సెక్స్ పార్టనర్ క్యూబా పర్యటనలో ఉండగా అతనికి  వైరస్‌ అటాక్ అయినట్లు మాడ్రిడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇది ఒక రకంగా డాక్టర్లను కూడా షాక్‌కి గురిచేసింది. ఇరువురి బ్లడ్ శాంపిల్స్‌తో పాటు పలు టెస్ట్‌లు చేసిన అనంతరం డాక్టర్లు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇప్పటికే ప్రాణాంతకంగా తయారైన డెంగీ..తన వ్యాప్తి పరిధిని విస్తరించడంతో పలువురు వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu