సూపర్‌ఫాస్ట్ ట్రైన్ ఫుడ్.. ధరలు చూస్తే గుండె గుభేల్!

ఐఆర్‌సీటీసీ మరోసారి ప్రయాణీకులపై భారాన్ని మోపింది. ఇప్పటికే శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లలో అందించే ఆహార ధరలన్నీ పెంచిన సంస్థ.. తాజాగా ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో సైతం అందించే భోజనం, టిఫిన్ ధరలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా ప్లాటుఫారంలపై ఉండే స్టాళ్లలో కూడా ఆహార ధరల పట్టికలో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు సాధారణ మీల్స్ రూ.50 ఉండగా.. దాన్ని రూ.80 చేశారు. టిఫిన్స్ అయితే రూ.10 చొప్పున పెరిగాయి. జనతా ఆహార ధరలో […]

  • Ravi Kiran
  • Publish Date - 10:04 am, Sun, 22 December 19
సూపర్‌ఫాస్ట్ ట్రైన్ ఫుడ్.. ధరలు చూస్తే గుండె గుభేల్!

ఐఆర్‌సీటీసీ మరోసారి ప్రయాణీకులపై భారాన్ని మోపింది. ఇప్పటికే శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లలో అందించే ఆహార ధరలన్నీ పెంచిన సంస్థ.. తాజాగా ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో సైతం అందించే భోజనం, టిఫిన్ ధరలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా ప్లాటుఫారంలపై ఉండే స్టాళ్లలో కూడా ఆహార ధరల పట్టికలో భారీ మార్పులు చేసింది.

ఇప్పటివరకు సాధారణ మీల్స్ రూ.50 ఉండగా.. దాన్ని రూ.80 చేశారు. టిఫిన్స్ అయితే రూ.10 చొప్పున పెరిగాయి. జనతా ఆహార ధరలో మాత్రం ఏమార్పు చేయలేదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అటు టీ, కాఫీలను రూ.10కు విక్రయించనుండగా. . రైళ్లలో అమ్మే వెజ్‌, ఎగ్‌, చికెన్‌ బిర్యానీలను రూ.80, 90, 110కు అమ్మనున్నారు.