సొంత యుద్ధ నౌక‌పైనే క్షిప‌ణి దాడి.. 19 మంది మృతి..

సొంత యుద్ధ నౌక‌పైనే క్షిప‌ణి దాడి.. 19 మంది మృతి..

సైనిక విన్యాసాల పేరుతో త‌ర‌చూ ఆ దేశం త‌ప్పిదాలు చేస్తూనే ఉంది. ఊహించ‌ని ప్ర‌మాదాలు జ‌రిగిపోయిన అనంత‌రం త‌ప్పులు అంగీక‌రించ‌టం ప‌రిపాటిగా మారింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ దేశం చేసిన సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తుండ‌గా,  పొర‌బాటున త‌మ దేశానికే చెందిన యుద్ధ నౌక‌పై మిస్సైల్‌ దాడి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే… ఇరాన్ మిస్సైల్ పొరబాటున తమ దేశానికి చెందిన యుద్ధ నౌకపై దాడి చేసింది. దీంతో యుద్ధ నౌకలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా […]

Jyothi Gadda

|

May 11, 2020 | 3:06 PM

సైనిక విన్యాసాల పేరుతో త‌ర‌చూ ఆ దేశం త‌ప్పిదాలు చేస్తూనే ఉంది. ఊహించ‌ని ప్ర‌మాదాలు జ‌రిగిపోయిన అనంత‌రం త‌ప్పులు అంగీక‌రించ‌టం ప‌రిపాటిగా మారింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ దేశం చేసిన సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తుండ‌గా,  పొర‌బాటున త‌మ దేశానికే చెందిన యుద్ధ నౌక‌పై మిస్సైల్‌ దాడి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే…
ఇరాన్ మిస్సైల్ పొరబాటున తమ దేశానికి చెందిన యుద్ధ నౌకపై దాడి చేసింది. దీంతో యుద్ధ నౌకలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సైనిక శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఏడాది జనవరిలో ఇరాన్ పొరబాటున ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని కూల్చి వేసింది. ఈ ఘటనలో 176 మంది చనిపోయారు. అనంతరం ఇరాన్ తన తప్పిదాన్ని అంగీకరించింది.
తాజాగా, జ‌రిగిన ప్ర‌మాదంలో ఇరాన్ కు చెందిన యుద్ధ‌నౌక ధ్వంసం అయ్యింది. ప్రపంచంలోని చమురు రవాణాలో 20 శాతం వాటా ఇరుకైన పర్షియన్ గల్ఫ్ గుండా జరుగుతోంది. దీనికి అత్యంత చేరువలోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ తరచుగా విన్యాసాలు చేపడుతోంది. టెహ్రాన్‌కు 790 మైళ్ల దూరంలోని పోర్ట్ ఆఫ్ జాస్క్‌లో ఆదివారం ఈ ఘ‌ట‌న చేసుకుంది. ఈ మేర‌కు ఇరాన్ స్టేట్ టెలివిజ‌న్ వార్త‌ను ప్ర‌సారం చేసింది. పోర్చుగల్ రూపొందించిన కోణార్క్ యుద్ధనౌక పొడవు 47 మీటర్లు, సామర్థ్యం 40 టన్నులు. 1988 నుంచి సేవలు అందిస్తోన్న ఈ యుద్ధనౌకకు 2018లో మరమ్మతులు చేశారు. ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉంటార‌ని స‌మాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu