తెలంగాణ పాలిటిక్స్‌‌లో ఓ ఐపీఎస్ కలకలం.. కేసీఆర్ సీరియస్

తెలంగాణ రాజకీయాల్లో ఓ ఐపీఎస్ అధికారి పేరు కలకలం సృష్టిస్తోంది. ఐపీఎస్ హోదాను, అధికారిక బాధ్యతలను వదిలేసి తెలంగాణ కేబినెట్‌లోకి ఎంటరరవుతారంటూ జరిగిన ప్రచారం చివరికి కేసీఆర్ సీరియస్ అయ్యే దాకా వెళ్ళింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఐపీఎస్ అధికారి తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా చేరతారంటూ ప్రచారం మొదలైంది. కేబినెట్‌లో చేరడమే కాదు ఏకంగా కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ శాఖను చేపడతారన్నది సదరు వదంతి సారాంశం. అయితే ఇపుడీ ప్రచారం బూమరాంగ్ అయ్యింది. కేసీఆర్‌ […]

తెలంగాణ పాలిటిక్స్‌‌లో ఓ ఐపీఎస్ కలకలం.. కేసీఆర్ సీరియస్
Follow us

|

Updated on: Feb 11, 2020 | 6:54 PM

తెలంగాణ రాజకీయాల్లో ఓ ఐపీఎస్ అధికారి పేరు కలకలం సృష్టిస్తోంది. ఐపీఎస్ హోదాను, అధికారిక బాధ్యతలను వదిలేసి తెలంగాణ కేబినెట్‌లోకి ఎంటరరవుతారంటూ జరిగిన ప్రచారం చివరికి కేసీఆర్ సీరియస్ అయ్యే దాకా వెళ్ళింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఐపీఎస్ అధికారి తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా చేరతారంటూ ప్రచారం మొదలైంది. కేబినెట్‌లో చేరడమే కాదు ఏకంగా కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ శాఖను చేపడతారన్నది సదరు వదంతి సారాంశం. అయితే ఇపుడీ ప్రచారం బూమరాంగ్ అయ్యింది.

కేసీఆర్‌ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారన్న వార్త ఇటీవల వైరల్ అయ్యింది. రాజకీయాలతో సంబంధం లేని ఓ ఫేస్‌ కేబినెట్‌లోకి వస్తుందని…ఆయనకు ఐటీ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇంతకీ ఈ క్యాంపెయిన్‌ వెనుక అసలు ఏం జరిగింది? ఆ పోలీసు అధికారి తెలంగాణ రాజకీయాలతో ఏం సంబంధం? వదంతి ప్రారంభం కాగానే దాని వెనుకున్న లోతుపాతులను కూపీ లాగడం మీడియా వంతైంది. ఈ నేపథ్యంలోనే అసలు వెలుగులోకి వచ్చింది.

మలయాళం భాషకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్‌లో ఫస్ట్‌ ఈ వార్త వచ్చింది. కేరళ కేడర్‌కు చెందిన తెలుగు ఐపీఎస్ అధికారి జి. లక్ష్మణ్ త్వరలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కేబినెట్‌లో చేరబోతున్నారు. ఇది వార్త సారాంశం. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్… గతంలోనే రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన తెలంగాణ కేబినెట్‌లోకి రాబోతున్నారనే ఆన్‌మనోరమ మీడియా కథనం సంచలనం సృష్టిస్తోంది. మంత్రివర్గంలోకి చేరడానికి ముందే లక్ష్మణ్ టీఆర్ఎస్‌లో చేరతారని… ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలియజేశారని ఈ కథనంలో పేర్కొన్నారు.

1997 బ్యాచ్‌కు చెందిన లక్ష్మణ్… మాజీ డీజీపీ డి.టి నాయక్‌ అల్లుడు. కేరళ కేడర్‌ అధికారి. 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అలాంటాయన ఇప్పుడు ఏకంగా మంత్రివర్గంలో చేరబోతున్నారని మనోరమ పత్రికలో కథనం వచ్చింది. మరో 14 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ వార్త హల్‌చల్‌ కావడం వెనుక ఎవరున్నారు అనే విషయంపై తెలంగాణ నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి,

మనోరమ ఆన్‌లైన్‌లో సైట్‌లో ఈ వార్త మొదట కనిపిస్తే.. ఆ తర్వాత తెలుగు వెబ్‌సైట్లలో ఈ వార్త హల్‌చల్‌ చేసింది. నిఘా వర్గాలు చెబుతున్న ప్రకారం లక్ష్మణ్‌ తన పదవి గురించి వార్త ఆయనే స్వయంగా రాయించుకున్నారట. తన రాజకీయ ప్రవేశం గురించి తెలంగాణ చర్చ జరిగేందుకు ఆయన ఈ ఎత్తుగడ వేశారని ఓ ప్రచారం నడుస్తోంది. మొత్తానికి కేరళ ప్రభుత్వానికి ఈ విషయంలో తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరినట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో లక్ష్మణ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యారు.

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు