ఐపీఎల్ 2020: రాహుల్ మెరుపు శతకం.. పంజాబ్ భారీ స్కోర్

పంజాబ్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బెంగళూరుకు కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌తో చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాహుల్ 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020లో ఇదే తొలి శతకం కావడం గమనార్హం. (IPL 2020) రాహుల్ ఇన్నింగ్స్‌లో 14ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. బెంగళూరు కెప్టెన్ […]

  • Publish Date - 9:30 pm, Thu, 24 September 20
ఐపీఎల్ 2020: రాహుల్ మెరుపు శతకం.. పంజాబ్ భారీ స్కోర్

పంజాబ్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బెంగళూరుకు కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌తో చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాహుల్ 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020లో ఇదే తొలి శతకం కావడం గమనార్హం. (IPL 2020)

రాహుల్ ఇన్నింగ్స్‌లో 14ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండుసార్లు క్యాచ్‌లు వదిలేయడం.. రాహుల్‌కు కలిసొచ్చింది. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముఖ్యంగా రాహుల్ చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లను చితక్కొట్టాడు. చాహల్ ఒక్క వికెట్ పడగొట్టగా.. శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు.