ఐపీఎల్‌కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..

క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే అదే సమయానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా మొదలవుతుండటంతో..

ఐపీఎల్‌కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..
Follow us

|

Updated on: Aug 01, 2020 | 6:36 PM

 IPL 2020 in UAE: క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే అదే సమయానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా మొదలవుతుండటంతో.. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లకు ఈ రెండు జట్ల ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ వంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక యూఏఈ ఐపీఎల్ టోర్నీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓవర్సీస్ ఆటగాళ్లు అందరూ కూడా వారం రోజుల క్వారంటైన్ పాటిస్తారని.. అలాగే రెండుసార్లు కోవిడ్ టెస్టులు చేస్తామని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మిగతా క్రికెట్ బోర్డులు అన్నీ కూడా ఇప్పటికే ఆటగాళ్ళు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చేసాయి. కాగా, కారేబియన్ ప్రీమియర్ లీగ్, శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ కూడా సెప్టెంబర్ రెండోవారం వరకు జరుగనున్న నేపధ్యంలో ఆ లీగ్స్‌లో పాల్గొన్న క్రికెటర్లు సైతం రెండు వారాల తర్వాత తమ ఫ్రాంచైజీ జట్లతో కలుస్తారు.