IPL 2020 : రాయుడు వస్తే అంతా సర్దుకుంటుంది: ధోనీ

అంబటి రాయుడు జట్టులో లేకపోవడంతోనే పరాజయాలు ఎదురవుతున్నాయని చెన్నై కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ అభిప్రాయపడ్డాడు.

IPL 2020 : రాయుడు వస్తే అంతా సర్దుకుంటుంది: ధోనీ
Follow us

|

Updated on: Sep 26, 2020 | 5:19 PM

అంబటి రాయుడు జట్టులో లేకపోవడంతోనే పరాజయాలు ఎదురవుతున్నాయని చెన్నై కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ అభిప్రాయపడ్డాడు. అతడు లేకపోవడంతో జట్టు కోఆర్డినేషన్ దెబ్బతింటోందని వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తే అంతా బాగుంటుందని మహీ ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ చేతిలో దారుణ పరాజయం తర్వాత ధోని మాట్లాడాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. పృథ్వీషా (64; 43 బంతుల్లో 9×4, 1×6), రిషభ్ పంత్‌ (37*; 25 బంతుల్లో 5×4), ధావన్‌ (35; 27 బంతుల్లో 3×4, 1×6),  శ్రేయస్‌ అయ్యర్‌ (26; 22 బంతుల్లో 1×4) రాణించారు. ఛేజింగ్ కు దిగిన చెన్నైకి మంచి ఓపెనింగ్ లభించలేదు. ఓపెనర్లిద్దరూ 34 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. ఆపద్భాందవుడు ధోనీ (15; 12 బంతుల్లో 2×4) సైతం పెద్దగా  పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. డుప్లెసిస్‌ (43; 35 బంతుల్లో 4×4) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో ధోని సేన 131/7 పరుగులకే పరిమితమైంది.

‘అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో పరాజయాలు ఎదురయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. తేమ లేనప్పటికీ వికెట్‌ నెమ్మదించింది. ఇది మాకు మంచి మ్యాచ్‌ కాదు. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మాకు ఇబ్బందికరంగా మారింది. మంచి ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన టార్గెట్, జట్టుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే అంతా సెట్ అవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ ఛాన్సుంటుంది’ అని ధోనీ పేర్కొన్నాడు.

Also Read :

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం, ఈ పోలీసన్నకు సెల్యూట్

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు