ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఇషాంత్ ఔట్..

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 మొదలై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్...

  • Ravi Kiran
  • Publish Date - 9:14 am, Tue, 13 October 20
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఇషాంత్ ఔట్..

Delhi Capitals IPL 2020: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 మొదలై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్,  అమిత్ మిశ్రా, అలీ ఖాన్ గాయాలు కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో ఆటగాడు చేరాడు. ఢిల్లీ జట్టు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ పక్కటెముకల్లో గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా వెల్లడించింది.

కాగా, ఇప్పటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచులు ఆడగా.. అందులో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఇషాంత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. కాగా, గతంలో కూడా ఇషాంత్‌ గాయాలు కారణంగా చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. వాటి వల్ల ఈ 32 ఏళ్ల పేసర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇక ఇషాంత్ త్వరగా గాయం నుంచి కోలుకుంటే ఈ ఏడాది చివర్లో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ ఆడే అవకాశం ఉండొచ్చు.

Also Read: ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?