ఐపీఎల్ 2020: SRH Vs CSK, చెన్నై మళ్లీ గెలుపు బాటపట్టేనా.?

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ మరో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

  • Ravi Kiran
  • Publish Date - 12:24 pm, Tue, 13 October 20
ఐపీఎల్ 2020: SRH Vs CSK, చెన్నై మళ్లీ గెలుపు బాటపట్టేనా.?

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ మరో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడగా.. హైదరాబాద్ మూడు విజయాలు సాధించి.. నాలుగింటిలో ఓటమిపాలైంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు ఓటములు చవి చూడగా.. కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.

ఈ ఏడాది చెన్నై ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా వైఫల్యం అవుతోంది. ఓపెనర్ షేన్ వాట్సన్, డుప్లెసిస్ మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. చెన్నైకు మిడిల్ ఆర్డర్ సెట్ అయితే.. ఆ జట్టు ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. అలాగే ధోని మళ్లీ ఫినిషర్ స్థానాన్ని తీసుకుంటే సీఎస్‌కేకు తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు.

అటు సన్‌రైజర్స్ కూడా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఉన్నాయి. ఆ జట్టు ఓపెనర్స్ మొదట్లో క్రీజులో నిలదొక్కుకునేందుకు టైం తీసుకోవడంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టెస్ట్ మ్యాచ్‌లాగ ఆడుతుండటం వారికి ఇబ్బంది కలిగిస్తోంది. అయితే బౌలర్లు మాత్రం సమిష్టిగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్ శర్మలతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరి ఈ మ్యా‌చ్‌లో ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.