20 బంతుల్లో స్టోయినిస్‌ హాఫ్ సెంచరీ

ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ స్టోయినిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  21 బంతుల్లో ‌53  (7x4, 3x6) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

20 బంతుల్లో స్టోయినిస్‌ హాఫ్ సెంచరీ
Follow us

|

Updated on: Sep 20, 2020 | 10:26 PM

ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ స్టోయినిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  21 బంతుల్లో ‌53  (7×4, 3×6) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మొదట్నుంచి ఢిల్లీ బ్యాట్స్‌మన్ ను కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు స్టోయినిస్ ముందు తేలిపోయారు.   స్టోయినిస్‌ విజృంభణతో ఢిల్లీ ‌ 157 పరుగులు చేయగలిగింది. అంతకుముందు మెయిన్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (39; 32 బంతుల్లో 3×6), రిషభ్‌ పంత్‌ (31; 29 బంతుల్లో 4×4) కాసేపు నిలకడగా ఆడటంతో పరిస్థితి మెరుగుపడింది. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టును షమి బెంబేలెత్తించాడు. మొదటి  13 పరుగులకే  ఓపెనర్లు పృథ్వీషా(5), శిఖర్‌ ధావన్‌(0) సహా షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(7) వరుసగా పెవిలియన్  చేరారు. అనంతరం పంత్‌, శ్రేయస్‌ జాగ్రత్తగా స్కోర్ బోర్డు ముందుకు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 73 రన్స్ జోడించారు. స్కోర్‌ 86 పరుగుల వద్ద తొలుత పంత్‌ బిష్ణోయ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అవ్వగా తర్వాతి ఓవర్‌లోనే శ్రేయస్‌ కూడా షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టోయినిస్‌ వరుస బౌండరీలతో దుమ్మురేపాడు. చివరి ఓవర్‌లో అతడు రెండు సిక్సులు, మూడు ఫోర్లు బాదడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి అతడు రనౌటయ్యాడు. అయితే, అది నోబాల్‌ కావడంతో ఢిల్లీకి చివర్లో అదనపు బంతి లభించింది

Also Read :  తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..