“వెంకీమామ” గొప్ప అనుభూతినిచ్చే చిత్రం.. : డైరెక్టర్ బాబీ

వెంకీమామ గొప్ప అనుభూతినిచ్చే చిత్రం.. : డైరెక్టర్ బాబీ

‘‘వెంకీమామ’.. యంగ్ డైరక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఇది దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకే కాదు.. సినీ ప్రియులకూ కూడా గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా అన్నారు డైరక్టర్ బాబీ. తొలుత స్క్రీన్‌ప్లే.. రచయితగా వెండితెరకు పరిచయమై ‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’,‘జై లవకుశ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ – నాగచైతన్య హీరోలుగా.. తెరకెక్కించిన చిత్రమే ‘వెంకీమామ’. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Dec 07, 2019 | 1:51 PM

‘‘వెంకీమామ’.. యంగ్ డైరక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఇది దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకే కాదు.. సినీ ప్రియులకూ కూడా గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా అన్నారు డైరక్టర్ బాబీ. తొలుత స్క్రీన్‌ప్లే.. రచయితగా వెండితెరకు పరిచయమై ‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’,‘జై లవకుశ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ – నాగచైతన్య హీరోలుగా.. తెరకెక్కించిన చిత్రమే ‘వెంకీమామ’. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నా ఈ మూవీ.. డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో.. విలేకర్లతో చిట్‌చాట్ చేశారు బాబీ. ఇక చిత్రం విశేషాలేంటో.. బాబీ మాటల్లోనే..

ఈ మూవీ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఈ స్టోరీలోకి సడన్‌గా ఎంటర్ అయ్యా. నిర్మాత సురేష్‌బాబు అవకాశమిచ్చారు. ‘జై లవకుశ’ చిత్రం తర్వాత ఓ అగ్ర హీరోతో సినిమా చెయ్యాలనుకున్నా. అదే సమయంలో కోన వెంకట్‌ నన్ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి తెలిపారు. ‘సురేష్‌బాబు గారు వెంకటేష్‌-నాగచైతన్యలతో మామా అల్లుళ్ల చిత్రమొకటి తీద్దామనుకుంటున్నారు. ఓసారి నువ్వు వెళ్లి స్టోరీ వినొచ్చుగా’అంటూ కోన తెలిపారు. వెళ్లి కథ విన్నా. ఆ తర్వాత నా టీంతో కలిసి.. కొన్ని మార్పులు చేసి.. సురేష్‌ గారికి చెప్పాం. ఆయనకది బాగా నచ్చడంతో వెంట‌నే సినిమాను ప్రారంభించాం.

ఈ చిత్రం రామానాయుడు గారి డ్రీమ్ కదా..! మరి ఇది మీకు దక్కడం ఎలా అనిపించింది? ఇది నాకు దక్కిన గౌరవంతో కూడిన పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. ఈ స్టోరీ నాకు ఇచ్చినప్పుడే సురేష్ గారు మా నాన్న కలల బాధ్యత అని.. నీ చేతుల్లో పెడుతున్నామని చెప్పారు. ఆ మూమెంట్‌లో ఎంతో హ్యాపీ అనిపించింది. నేనూ ఈ మూవీని నా లైఫ్‌లా ఫీలై చేశా. నా బలం ఏంటో ఆడియన్స్‌కు చూపించాలి అని.. ఎక్కువే కష్టపడ్డాను.

మూవీ టైటిల్‌ ఆలోచన ఎవరిది? టైటిల్ ఆలోచన పూర్తిగా.. సురేష్‌ బాబు సర్‌దే. నేను స్క్రిప్ట్‌ వర్క్స్‌లో పడి టైటిల్‌పై అంత దృష్టి పెట్టలేదు. ఇంతలో ఓ రోజు సురేష్‌ సర్‌ ఫోన్‌ చేసి.. టైటిల్ గురించి ఏం థింక్ చేశావు అన్నారు. ఇంకా ఏం అనుకోలేదన్నా. సరే.. ‘‘వెంకీమామ’ ఎలా ఉంటుంది? చైతూ ఎప్పుడూ వెంకటేష్‌ను అలాగే పిలుస్తుంటాడు. ఈ పేరు ఓకేనా అన్నారు. మరో ఆలోచన లేకుండా ఇదే పెట్టేద్దాం సర్‌ అన్నా.

వెంకీ- చైతూ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది పల్లెటూరి నేపథ్యంగా సాగే మామా అల్లుళ్ల స్టోరీ. వెంకీ మిలటరీ నాయుడుగా కనిపిస్తారు. ఇందులో ఆయన నమ్మేది రెండిటినే. ఒకటి కిసాన్‌.. రెండు సోల్జర్‌. ఇక నాగచైతన్య సిటీ నుంచి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా కనిపించనున్నాడు. చిత్రం మొత్తం ఆద్యంతం వినోదాత్మకంగా, ఏమోషనల్స్‌తో సాగుతుంది.

పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా ఈ స్టోరీలోకి ఎలా ఎంటర్ అయ్యారు.? ఇద్దరూ అనుకోకుండానే ఎంట్రీ ఇచ్చారు. వెంకీ సరసన కనిపించబోయే నాయిక టీచర్‌ కాబట్టి పరిణతితో కూడిన భావాలతో కనిపిస్తూనే గ్లామర్‌గానూ ఉండాలని.. ఆ క్వాలిటీస్.. పాయల్‌ రాజ్‌పుత్‌లో కనిపించాయి. అయితే తొలుత ఈ పాత్రకు పాయల్‌ను సూచించింది థమన్‌. తనే ఆమె ఫొటోని నాకు పంపించాడు. అది చూడగానే వెంకీకి ఆమె సరిగ్గా సెట్ అవుతుందనిపించింది. ఇక రాశీ ఖన్నా పాత్రకి ముందు ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నాం.. కానీ,, చివరి నిమిషంలో రాశీనే ఫిక్స్‌ అయ్యాం.

సినిమా చూసి దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? వెంకటేష్, చైతన్య, సురేష్‌బాబు, తమన్‌ అందరూ సినిమా చూశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. సురేష్‌ సర్‌ ఎప్పుడూ ఓపెన్‌గా పొగడటం వంటివి చెయ్యరు. కానీ, సినిమా చూశాక ఆయన చాలా హ్యాపీగా కనిపించారు. వెంకీ.. చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లావన్నారు. ఇక చైతూ.. గట్టిగా కౌగిలించుకోని థ్యాంక్స్‌ చెప్పారు. అయితే నాగార్జున గారు ఇంకా చూడలేదు.

కాశ్మీర్ ఎపిసోడ్ గురించి చెప్పండి.? ‘వెంకీమామ’ చిత్రీకరణ మొత్తంలో..సవాల్‌గా నిలిచింది కశ్మీర్‌ ఎపిసోడ్‌. గ్లేషియర్‌ అనే పర్వత శ్రేణుల్లో 13 రోజుల పాటు యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించాం. అసలు ఈ గ్లేషియర్ పర్వత శ్రేణులు దూరం నుంచి చూడటానికి ఎంత బాగుంటాయి. కానీ అక్కడికి వెళ్లి చిత్రీకరణ జరపడం మాత్రం ఎంతో కష్టం. ఆ మంచులో పర్వతంపైకి ఎక్కడమనేది ఓ పెద్ద సవాల్. హీరోలు, సిబ్బంది ఎవరైనా పై వరకు నడిచి వెళ్లాల్సిందే. మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయితే.. అక్కడికి చేరుకోవడానికి 9 గంటలయ్యేది. దీంతో.. ముందు అక్కడ సీన్స్ అనుకున్నప్పుడు ఇదంతా పెద్ద రిస్క్‌.. వద్దులే అన్నాను. కానీ, సురేష్‌ గారు ఎంత కష్టమైనా పర్లేదు అక్కడే చేద్దామంటూ ఎంకరేజ్ చేశారు. దీనికి తోడుగా.. వెంకీ – చైతూలు కూడా సై అనడంతో చిత్రీకరణ పూర్తి చేశాం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu