డ్రగ్స్‌కు చెబుదాం టాటా..!

నేడు అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లోని కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మారక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను యువతకు వివరించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ప్రయోగాలతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా ఇలాంటి సమయంలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. ఆడ మగా అని తేడా లేదు అమ్మాయిలు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది. దీని బారిన […]

డ్రగ్స్‌కు చెబుదాం టాటా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 26, 2019 | 3:14 PM

నేడు అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లోని కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మారక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను యువతకు వివరించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ప్రయోగాలతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా ఇలాంటి సమయంలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. ఆడ మగా అని తేడా లేదు అమ్మాయిలు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది. దీని బారిన పడి ఎంతో మంది చిక్కుల్లో పడుతున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తల్లిదండ్రులు పట్టించుకోకపోడం, ఉద్యోగ సమస్య వంటివి యువత మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి అలవాటు ఉండటం పిల్లల్ని మత్తుపదార్థాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఒకసారి బానిసైతే చాలు దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఏపీలో మత్తు పదార్థాల సరఫరాలను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పోలీసులు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. వివిధ రకాల మత్తు పదార్థాలు లభ్యమవుతూనే ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu