జులై రెండో వారం నుంచి మళ్ళీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ?

జులై రెండో వారం (జులై 15) నుంచి  కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుధ్ధరించనున్నట్టు తెలుస్తోంది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ట్రాఫిక్ 50 శాతానికి చేరితే

జులై రెండో వారం నుంచి మళ్ళీ అంతర్జాతీయ  విమాన సర్వీసులు ?
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 8:48 PM

జులై రెండో వారం (జులై 15) నుంచి  కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుధ్ధరించనున్నట్టు తెలుస్తోంది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ట్రాఫిక్ 50 శాతానికి చేరితే ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను మళ్ళీ ప్రారంభించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. కరోనా ఎపిడమిక్ కి ముందు దేశీయ విమానాల్లో రోజూ దాదాపు మూడు లక్షల మంది ప్రయాణించేవారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది. మే 25 నుంచి రోజుకు సుమారు 65 వేల నుంచి 70 వేల వరకు మాత్రం ప్రయాణిస్తున్నారు. డొమెస్టిక్ రూట్ లో ప్రస్తుతం 700 విమానాలు నడుస్తున్నాయి. వచ్ఛే వారం నుంచి డొమెస్టిక్ రూట్లను పెంచనున్నట్టు పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. కరోనా భయంతో  చాలా వరకు  విమానాల్లో ప్రయాణికుల సంఖ్య  తగ్గిపోయిన విషయం నిజమేనని ఆయన అంగీకరించారు.