ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై అమెరికా ఆసక్తి……క్లారిటీ కావాలన్న జాతీయ భద్రతా సలహాదారు

అమెరికాతో చర్చలకు గానీ, ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు గానీ తాము సిధ్దమంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఇది ఆసక్తికరమైన సంకేతంలా కనిపిస్తోందని పేర్కొంది. అయితే కొరియన్ పీఠ భూభాగంలో నిస్సైనికీకరణ

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై అమెరికా ఆసక్తి......క్లారిటీ కావాలన్న జాతీయ భద్రతా సలహాదారు
Interesting Signal Says Us On Kim Jong Uns Comments
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 21, 2021 | 1:00 PM

అమెరికాతో చర్చలకు గానీ, ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు గానీ తాము సిధ్దమంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఇది ఆసక్తికరమైన సంకేతంలా కనిపిస్తోందని పేర్కొంది. అయితే కొరియన్ పీఠ భూభాగంలో నిస్సైనికీకరణ (డీమిలిటరైజేషన్) జరిగే దిశగా ఆ దేశం నుంచి అందే డైరెక్ట్ సమాచారం కోసం తాము వేచి చూస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెక్ సులీవన్ తెలిపారు. అమెరికాతో డైలాగ్ గురించి ఇప్పటివరకు వ్యాఖ్యానించని కిమ్..ఇలా మొదటిసారిగా అనడం విశేషమేనని ఆయన అన్నారు. కానీ మాతో నేరుగా సంప్రదింపులకు ఆయన రెడీగా ఉన్నారా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. ఉత్తర కొరియా పీఠ భూభాగంలో పూర్తిగా డీమిలిటరైజేషన్ జరగాలని…ఆ దిశగా ఆ దేశ అణు కార్యక్రమం ఉండాలని అధ్యక్షుడు జోబైడెన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా సూత్రప్రాయంగా చర్చలకు సిద్దమన్నట్టు సంకేతాలిస్తున్నారని జెక్ వెల్లడించారు.

నార్త్ కొరియాకు సంబంధించి బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త పాలసీపై కిమ్ ఇటీవల జరిగిన తమ వర్కర్స్ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు., ఇదే సమయంలో దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, కోవిద్ కారణంగానూ , గత ఏడాది సంభవించిన తుఫానుల వల్లను దేశ ఎకానమీ క్షీణించిందని ఆయన అన్నారు. మరోవైపు- ఎన్నడూ లేనిది అమెరికా తమ వార్ షిప్ యుద్దానికి సిద్ధంగా ఉందా లేదా అన్నది ధృవీకరించుకోవడానికి ఫ్లోరిడా కోస్ట్ గార్డ్ కి దూరంగా ఉన్న అట్లాంటిక్ మహా సముద్రంలో వరుసగా ఫర్ షిప్ షాక్ ట్రయల్స్ పేరిట శక్తిమంతమైన బాంబులను పేల్చింది. మొదటిసారిగా జరిగిన ఈ పరీక్షల్లో సముద్రపు నీరు ఉవ్వెత్తున పైకి ఎగసింది. సుమారు 40 వేల పౌండ్ల పేలుడు శక్తి.. రిక్టర్ స్కేలుపై 3.9 మ్యాగ్నిట్యూడ్ తో భూకంప తీవ్రతకు సమానంగా నమోదైంది.

మరిన్ని ఇక్కడ చూడండి: మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.

నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?