టిక్‌టాక్ బదులు ‘రీల్స్’..

టిక్‌టాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ మరో అడుగు ముందుకేసింది. 15 సెకన్ల నిడివి గల వీడియోలు రూపొందించే రీల్స్ అనే కొత్త అప్షన్ తీసుకొచ్చింది. టెస్టింగ్ లో భాగంగా టిక్‌టాక్ స్టార్లు తమ

  • Tv9 Telugu
  • Publish Date - 9:42 pm, Thu, 9 July 20
టిక్‌టాక్ బదులు 'రీల్స్'..

టిక్‌టాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ మరో అడుగు ముందుకేసింది. 15 సెకన్ల నిడివి గల వీడియోలు రూపొందించే రీల్స్ అనే కొత్త అప్షన్ తీసుకొచ్చింది. టెస్టింగ్ లో భాగంగా టిక్‌టాక్ స్టార్లు తమ వీడియోలు పోస్టు చేయాలని కోరింది. ఇన్‌స్టాను అప్‌డేట్ చేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్ లకు 15 సెకన్ల వీడియోలు చేసి పోస్ట్ పెట్టవచ్చు. ఇది సక్సెస్ అయితే చింగారీ, రోపోసోలకు గట్టిపోటీ ఎదురవనుంది. టిక్‌టాక్‌తో పోల్చితే రీల్స్ ఉపయోగించడం కాస్త కష్టతరం. టిక్‌టాక్ ఒక ప్రత్యేక యాప్ కాగా.. రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో జోడించిన మరో ఫీచర్.