ఒకేసారి 6 సర్కారీ కొలువులు సాధించిన ‘ఆదర్శ అక్కా చెల్లెళ్లు’

మారు మూల గ్రామంలోని పేదింటి వ్యవయ కుటుంబంలో జన్మించి చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరు 4, మరోకరు 2. ఏకంగా ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుని శభాస్ అనిపిచ్చుకున్నారు

ఒకేసారి 6 సర్కారీ కొలువులు సాధించిన ‘ఆదర్శ అక్కా చెల్లెళ్లు’
Follow us

|

Updated on: Nov 06, 2020 | 3:12 PM

మారు మూల గ్రామంలోని పేదింటి వ్యవయ కుటుంబంలో జన్మించి చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరు 4, మరోకరు 2. ఏకంగా ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుని శభాస్ అనిపిచ్చుకున్నారు ఈ పేదింటి ఆడబిడ్డలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడానికే ఎంతో మంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు..కాని, కాష్ట పడి ఏకాగ్రత, నిరంతర శ్రమతో చదివితే అనుకున్న లక్ష్యన్ని సాధించవచ్చని ఈ ఆడ బిడ్డలు నిరూపించి చుట్టూ పక్కల గ్రామాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ మండలంలోని మారుమూల గ్రామమైన పెర్కపల్లెకు చెందిన చుంచు భూమన్న-లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో పెద్ద కూతురు చుంచు ఉమారాణి, చిన్న కుమార్తె మౌనికలు చదువుల్లో మెరికలు. నాలుగేళ్ల క్రితం చుంచు ఉమారాణి పోలీస్‌, ఆబ్కారీ కానిస్టేబుల్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆమె ఆబ్కారీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇపుడు చెల్లెలు మౌనికకు ఐటీ కానిస్టేబుల్‌, సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ఐటీ కానిస్టేబుల్‌ ఉద్యోగంలో శిక్షణపొంది నాలగు రోజులక్రితం నిర్మల్‌లో ఉద్యోగంలో చేరారు. పోటీపడి చదివి ఒకటికి మించి ఉద్యోగాలు సాధించిన అక్కాచెల్లెళ్లను స్థానికులు అభినందించడంతో పాటు ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు.

ఈ నేపథ్యంలో తండ్రి భూమన్న మాట్లాడుతూ .. నాకు నలుగురు కూతుర్లు , ఒక కొడుకు .. వీరిని చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించానని చెప్పారు. తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. మా పిల్లలు బడులకు సెలవు దినాల్లో నాకు వ్యవసాయంలో సాయం చేసే వారు.. ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తూ తనకు చేదోడు వాదోడుగా వుంటారని చెప్పాడు. అయితే ముగ్గురు కుతుర్లకు పెండ్లిల్లు చేసాను . నాలుగో కూతురు, కొడుకుకి ఇంకా పెండ్లి చేయలేదు.. వీరిని ఎలాగైనా కస్టపడి చదివించాలనే దృఢ సంకల్పంతో చదివించిన ఫలితంగా మొదటి కూతురి కి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు, నాలుగోవ కూతురి కి రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాదించి నాకు ఆనందాన్ని తెచ్చిపెట్టారుని సంతోషం వ్యక్తం చేశాడు. మా పిల్లలను చూసి చుట్ట పక్కల వారు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు.

నాల్గవ కూతురు మాట్లాడుతూ మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే కష్టపడి ఇష్టంతో చదివాం, మా నాన్నకు వ్యవసాయంలో కూడా సహాయపడుతూ వ్యవసాయం కూడా చేస్తాం.. మా అమ్మ, నాన్న, మా నానమ్మ కష్టపడుతున్న తీరును చూసి మాకు వారే ఆదర్శం అని అన్నారు.. వారి తో పొలం పనుల్లోకూడా పనులు చేస్తుంటాం.. ఇలాంటి సమయంలో ఎకగ్రత తో చదివి పోలీస్ సివిల్ కానిస్టేబుల్ , ఐటి కానిస్టేబులు సాధించాను. ప్రస్తుతం ఐటి కానిస్టేబుల్ ఉద్యోగంలో ట్రైనింగ్ పొంది నిర్మల్ లో ఉద్యోగంలో చేరానని అన్నారు… ఇష్టంతో కస్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని సూచించారు.

ఏది ఏమైనా సమాజంలో ఆడ పిల్లలంటే వద్దనుకునే తండ్రులను చూసాం కాని, ఈ తండ్రి నలుగురు ఆడ బిడ్డలను కనీసం భారంగా చూడకుండా కస్టపడి కూతుర్లను చదివించి ఇద్దరు కూతుళ్ళకు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా సహాయపడ్డ ఈ తల్లి తండ్రులను సమాజంలో అందరు ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!