Telugu News » Latest news » Indo american vivek murthy tobe in joe bidens coronavirus taskforce
జో బైడెన్ నేతృత్వంలోని ‘కరోనా టాస్క్ ఫోర్స్’ లో ఇండో-అమెరికన్ వివేక్ మూర్తి !
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జో బైడెన్ నేతృత్వంలో ఏర్పడనున్న కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని నియమించవచ్చునని తెలుస్తోంది. 43 ఏళ్ళ మూర్తి కర్నాటకకు చెందినవారు. ఆయన నియామకాన్ని బైడెన్ సోమవారం ప్రకటించవచ్చు. 2014 లో మూర్తిని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్ గా నియమించారు. అమెరికాలో కరోనా వైరస్ అదుపునకు కొత్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ […]
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జో బైడెన్ నేతృత్వంలో ఏర్పడనున్న కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని నియమించవచ్చునని తెలుస్తోంది. 43 ఏళ్ళ మూర్తి కర్నాటకకు చెందినవారు. ఆయన నియామకాన్ని బైడెన్ సోమవారం ప్రకటించవచ్చు. 2014 లో మూర్తిని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్ గా నియమించారు. అమెరికాలో కరోనా వైరస్ అదుపునకు కొత్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో ఈ టాస్క్ ఫోర్స్ కి ప్రముఖ నిపుణుడు ఫోసీ చైర్మన్ గా వ్యవహరించారు.