ఒక్క నిమిషంలో 95 బిర్యానీ ఆర్డర్స్! 2019లో స్విగ్గీ అదుర్స్!

2019లో స్విగ్గీ దుమ్ము రేపింది. ఏకంగా ఒక నిమిషంలో 95 బిర్యానీ ఆర్డర్స్ అందుకుని రికార్డు సృష్టించింది.  ప్రతీ సెకనుకు 1.6 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం తాజాగా తెలిపింది. వాస్తవానికి భారతదేశ ఆహార ఆర్డరింగ్ అలవాట్లపై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం సంస్థ పరిశోధన చేయగా.. ఈ న్యూస్ వెల్లడైంది. స్టేట్‌ఎటిస్టిక్స్ 2019 నివేదిక ప్రకారం.. స్విగ్గీలో కొత్త వినియోగదారులు చేసే మొదటి ఆర్డర్ బిర్యానీ అని తెలియజేశారు. […]

ఒక్క నిమిషంలో 95 బిర్యానీ ఆర్డర్స్! 2019లో స్విగ్గీ అదుర్స్!
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 5:34 PM

2019లో స్విగ్గీ దుమ్ము రేపింది. ఏకంగా ఒక నిమిషంలో 95 బిర్యానీ ఆర్డర్స్ అందుకుని రికార్డు సృష్టించింది.  ప్రతీ సెకనుకు 1.6 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం తాజాగా తెలిపింది. వాస్తవానికి భారతదేశ ఆహార ఆర్డరింగ్ అలవాట్లపై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం సంస్థ పరిశోధన చేయగా.. ఈ న్యూస్ వెల్లడైంది.

స్టేట్‌ఎటిస్టిక్స్ 2019 నివేదిక ప్రకారం.. స్విగ్గీలో కొత్త వినియోగదారులు చేసే మొదటి ఆర్డర్ బిర్యానీ అని తెలియజేశారు. వరుసగా మూడవ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన డిష్ జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. కాగా అలాగే.. సంవత్సరంలో కిచిడీకి కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిష్ కోసం ఆర్డర్లు ఈ సంవత్సరం 128 శాతం పెరిగాయి.

కాగా.. ఇక శాఖాహార టాపింగ్స్‌ విషయానికొస్తే.. పిజ్జాలంటే ఇష్టపడేవారు..లక్షల్లోనే ఉన్నారు. జున్ను, ఉల్లిపాయ, పన్నీర్, అదనపు జున్ను, పుట్టగొడుగు, క్యాప్సికమ్, మొక్కజొన్న, జలపెనోస్, ఆలివ్‌లు పిజ్జా ఆర్డర్‌లలో అత్యంత సాధారణ టాపింగ్స్‌లో ఉన్నాయని స్విగ్గీ ప్రతినిధులు తెలిపారు. తక్కువ ప్రాధాన్యత కలిగిన టాపింగ్‌గా పైనాపిల్‌ ఉంది. కాగా.. ఈ సంవత్సరం పిజ్జాలపై ఆర్డర్స్‌ 1.5 శాతం పెరిగాయి.

అలాగే స్వీట్స్‌లో ప్రజలు ఎక్కువగా.. గులాబ్ జామున్, మూంగ్ దాల్ హల్వాను ఇష్టమైనవిగా పేర్కొన్నారు. 2019లో కస్టమర్స్ 17,69,399 గులాబ్ జామున్ ఆర్డర్‌లు చేయగా, హల్వా కోసం 2,00,301 ఆర్డర్‌లు చేశారు. కాగా.. ఈ సంవత్సరం 11,94,732 ఆర్డర్‌లతో స్విగ్గీలో టాప్ డెజర్ట్‌లకు ఫలూడా సరికొత్త ఎంట్రీ ఇచ్చింది.

మొత్తంమీద, 2019లో అత్యధికంగా ఇష్టపడే వంటకాలు చికెన్ బిర్యానీ, మసాలా దోస, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, చికెన్ ధమ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్, దాల్ మఖానీ అని నివేదిక తెలియజేసింది.