బ్రిటన్ లో మ్యుటెంట్ కోవిడ్ ఎఫెక్ట్, విమానాల రద్దుతో చిక్కుకుపోయిన వేలాది విద్యార్థులు, కుటుంబాలు, ఎక్కడివారక్కడే

బ్రిటన్ లో కొత్త వైరస్  విజృంభణ కారణంగా పలు దేశాలతో బాటు ఇండియా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఆ దేశంలోని అనేకమంది భారతీయ విద్యార్థులు, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

బ్రిటన్ లో మ్యుటెంట్ కోవిడ్  ఎఫెక్ట్, విమానాల రద్దుతో చిక్కుకుపోయిన వేలాది  విద్యార్థులు, కుటుంబాలు, ఎక్కడివారక్కడే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 22, 2020 | 12:36 PM

బ్రిటన్ లో కొత్త వైరస్  విజృంభణ కారణంగా పలు దేశాలతో బాటు ఇండియా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఆ దేశంలోని అనేకమంది భారతీయ విద్యార్థులు, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ చిక్కుకు పోయామని కలత చెందుతున్నాయి. డిసెంబరులో క్రిస్మస్ సెలవులతో బాటు యూకే లోని పలు యూనివర్సిటీలు తమ హాస్టళ్లను ఖాళీ చేయవలసిందిగా కోరడంతో స్టూడెంట్స్ కి ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. వీరిలో చాలామంది లోగడ విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. యూకే-ఇండియా సెక్టార్ లో ట్రావెల్ పీరియడ్ కి సంబంధించి ఇది అత్యంత బిజీ సమయం. టూరిస్టు వీసాలను చాలావరకు రద్దు చేయడంతో బాటు కుటుంబ కారణాల వల్ల లండన్, ఇంగ్లండ్ వంటి నగరాల్లో ఉంటున్న భారతీయులు అయోమయంలో ఉన్నారు. అలాగే బ్రిటన్ లో ఉంటున్న తమ బంధువులను కలుసుకునేందుకు ఆ దేశానికి ఇండియా నుంచి వెళ్ళగోరుతున్న ఇండియన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇండియాలోని పౌర విమాన యాన శాఖ కార్యాలయం నుంచి అందుతున్న అప్డేట్లతో లండన్ లోని ఇండియన్ హైకమిషన్ ఆఫీసు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికల్లో సందేశాలు ఇస్తోంది. మెసేజులు  పంపుతోంది. ఈ నెల 22 నుంచి 31 వరకు యూకేకి ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసి న సంగతి విదితమే.

ఈ దేశంలో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున భారతీయులు దీన్ని తేలికగా తీసుకోరాదని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది బీజేపీ గ్రూప్ ప్రెసిడెంట్ కుల్ దీప్ షేఖావత్ కోరారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తోందని, తాజా గైడ్ లైన్స్ ని విడుదల చేస్తోందని ఆయన అన్నారు.,

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..