Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. 5 రైళ్ల రద్దు.. 6 రైళ్ల పునరుద్ధరణ.. పూర్తి వివరాలివే..

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు..

Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. 5 రైళ్ల రద్దు.. 6 రైళ్ల పునరుద్ధరణ.. పూర్తి వివరాలివే..
Indian Railways

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా పరిస్థితులు మెరుగుపడడంతో కొన్ని మార్గాల్లో రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. విజయవాడ డివిజన్‌లోని నెల్లూరు- పడుగుపాడు, గుంతకల్‌ డివిజన్‌లోని రాజంపేట- నందలూరు, రేణిగుంట- పూడి మార్గాల్లోని రైల్వే ట్రాకులపై నీరు నిలిచిపోవడం, మరమ్మతు పనులు కొనసాగుతుండడంతో 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మదురై-బికనీర్‌, చెన్నై సెంట్రల్‌- న్యూ జల్పాయి గూడ, సికింద్రాబాద్‌- గోరఖ్‌పూర్‌ రైళ్లను బుధవారం, గురువారం రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్‌- గోరఖ్‌పూర్‌- హెచ్‌.ఎస్‌. నాందేడ్‌- మన్మాడ్‌ మధ్య 25, 26, 27, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.


ఇక రేపటి నుంచి తిరుపతి – హజరత్‌ నిజాముద్దీన్‌ (12707), చెన్నై సెంట్రల్‌- ముంబయి సీఎస్‌ఎంటీ( 22160), ముంబయి సీఎస్‌ఎంటీ- చెన్నై సెంట్రల్‌ (22159), చెన్నై సెంట్రల్‌- అహ్మదాబాద్‌(22919), చెన్నై సెంట్రల్‌- ముంబయి ఎల్‌టీటీ (12164), ముంబయి ఎల్‌టీటీ- చెన్నై సెంట్రల్‌(12163)

Also Read:

Kerala Models Mishap case: మాజీ మిస్‌ కేరళ మృతి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు!

Kripal Singh Parmar: ఎన్నికలకు ముందు హిమాచల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కీలక నేత పార్మర్ రాజీనామా

Biryani Free Offer: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. కేజీ టమాటో ఇస్తే కేజీ బిర్యానీ ఫ్రీ.. ఇదెక్కడో తెలుసా..!

Click on your DTH Provider to Add TV9 Telugu