ఐపీఎల్ కొత్త లోగో…ఎలా ఉంది..!

క్రికెట్ రంగుల పండుగ మొదలవుతోంది. కరోనా భయం నుంచి క్రికెట్ ప్రియుల మనసును దోచుకునేందుకు రెడీ అవుతోంది. ఇందు కోసం ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఐపీఎల్ జరగబోతోంది. ఇప్పటికే మూడు జట్లు యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి....

  • Sanjay Kasula
  • Publish Date - 12:02 am, Fri, 21 August 20
ఐపీఎల్ కొత్త లోగో...ఎలా ఉంది..!

క్రికెట్ రంగుల పండుగ మొదలవుతోంది. కరోనా భయం నుంచి క్రికెట్ ప్రియుల మనసును దోచుకునేందుకు రెడీ అవుతోంది. ఇందు కోసం ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఐపీఎల్ జరగబోతోంది. ఇప్పటికే మూడు జట్లు యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. అక్కడ జరిగే మ్యాచ్ ను ఇంట్లో కూర్చొని చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ తెగ తొందర పడుతున్నారు.

సుసంపన్నమైన టీ20 లీగ్ గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్  తాజా సీజన్ కు స్పాన్సర్ మారిన సంగతి తెలిసిందే. చైనా సంస్థ అన్న కారణంగా వివోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.

దీంతో ఈ సీజన్ కు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు వివో ప్రకటించగా, ఆ స్థానంలో ఫాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 ఐపీఎల్ కొత్త స్పాన్సర్ గా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లోగో కూడా మారిపోయింది. ఐపీఎల్ తో డ్రీమ్ 11 సంస్థ పేరును కూడా కలిపి నూతన లోగో  రెడీ అయ్యింది. తాజాగా ఈ లోగోను ఆ సంస్థ విడుదల చేసింది. కాగా, ఐపీఎల్ సందడి ఈసారి యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనున్నాయి.