‘వుయ్ వాంట్ జో బిడెన్,’ ఇండో-అమెరికన్ల వీడియో ప్రచారం

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి, ఉపాధ్యక్ష పదవికి ఇదే పార్టీ నామినీ కమలా హారిస్ లకు అనుకూలంగా ఇండో-అమెరికన్ల ప్రచారం మెల్లగా ఊపందుకుంటోంది. వీరికే ఓటు..

'వుయ్ వాంట్ జో బిడెన్,'  ఇండో-అమెరికన్ల వీడియో ప్రచారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 22, 2020 | 5:46 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి, ఉపాధ్యక్ష పదవికి ఇదే పార్టీ నామినీ కమలా హారిస్ లకు అనుకూలంగా ఇండో-అమెరికన్ల ప్రచారం మెల్లగా ఊపందుకుంటోంది. వీరికే ఓటు వేయాలంటూ వీడియోలు రిలీజవుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్న అనేకమంది ప్రవాస భారతీయులు..ఓటర్లంతా వీరికే సమైక్యంగా ఓటు వేయాలని కోరుతున్నారు. వినీతా భటోరియా, ఆమె భర్త అజయ్ జైన్ భటోరియా ఈ వీడియోలో మాట్లాడుతూ..’అమెరికా కా నేతా కైసా హో ..జో బిడెన్ జై సా హో’ (అమెరికా నేత అంటే ఎలా ఉండాలంటే జో బిడెన్ లా ఉండాలి) అంటూ తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ వీడియోలో వివిధ భాషలవారు తమ సపోర్ట్ బిడెన్, హారిస్ లకే అంటూ నినదించారు.  ఇందులో తెలుగు దంపతుల మద్దతు కూడా స్పష్టంగా ఉంది.అలాగే భారతీయ కళారూపాలను కూడా ఈ వీడియోలో జోడించారు.

మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కెరొలినా, ఫ్లోరిడా, విస్కాన్సిన్, నెవడా రాష్ట్రాల్లోని   అనేకమంది తమ ఓటు వీరికేనని ప్రకటించారు. న్యూయార్క్ లోని ‘ఆసమ్ టీవీ’ ఫౌండర్ రితేష్ ఈ వీడియోను క్రియేట్ చేశారు.

https://www.facebook.com/ajayjainb/videos/10224142272211723/