కివీస్‌కు మరో ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్ నుంచి విలియమ్సన్ ఔట్!

India Vs New Zealand: కివీస్ టీ20 సిరీస్‌లో ఘోర ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అనుకోని విధంగా న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ టామ్ లాథామ్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతేకాక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మార్క్ చాప్‌మెన్.. విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. భారత్‌తో జరిగిన మూడో […]

  • Ravi Kiran
  • Publish Date - 2:05 pm, Tue, 4 February 20
కివీస్‌కు మరో ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్ నుంచి విలియమ్సన్ ఔట్!

India Vs New Zealand: కివీస్ టీ20 సిరీస్‌లో ఘోర ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అనుకోని విధంగా న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ టామ్ లాథామ్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతేకాక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మార్క్ చాప్‌మెన్.. విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

భారత్‌తో జరిగిన మూడో టీ20లో విలియమ్సన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత పెద్దగా లేకపోయినా.. ఫిజియోలు విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. అందువల్ల మిగతా రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేడు. ఇదిలా ఉంటే అతడు ఇంకా పూర్తి స్థాయి‌లో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మొదటి రెండు వన్డేల నుంచి తప్పుకున్నాడు. అయితే అప్పటికీ ఫిట్ కాకపోతే చివరి వన్డే కూడా ఆడే అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది.

అటు కివీస్ టీ20 సిరీస్ ఓటమి నుంచి బయటపడాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. వన్డేల్లో భారత్‌కు గట్టి పోటీనివ్వాలని చూస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ఈ నెల 5న హామిల్టన్ వేదికగా జరగనుంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.