టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ లేకపోవడం ఆస్ట్రేలియాకు లాభం: సునీల్ గవాస్కర్

భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2020 ముగియడం.. ముందు రాబోతున్న బడా సిరీస్ ఇదే కావడంతో...

టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ లేకపోవడం ఆస్ట్రేలియాకు లాభం: సునీల్ గవాస్కర్

India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2020 ముగియడం.. ముందు రాబోతున్న బడా సిరీస్ ఇదే కావడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. ఇప్పటికే నవంబర్ 27 నుంచి సిడ్నీ, కాన్‌బెర్రా స్టేడియంలలో జరగబోయే మ్యాచులకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సిరీస్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌‌ కాగా.. టెస్టులకు మాత్రం ఇది వ్యతిరేకం అవుతుందని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో ఉండకపోవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం అని వారి అభిప్రాయం. ఇదే కోవలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తన స్పందనను తెలియజేశాడు.

కోహ్లీ లేకపోవడంతో టెస్టు సిరీస్‌లో ఆసీస్‌కు లాభం చేకూరుతుందని సన్నీ తెలిపాడు. చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదు కాబట్టి.. ఆ ప్రభావం టీమిండియాపై ఖచ్చితంగా ఉంటుందని.. అలాగే ఇది ఆస్ట్రేలియాకు సానుకూలంశామని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో ప్రతీ ఆటగాడు కీలకమేనని సన్నీ చెప్పుకొచ్చాడు. అందరూ సమిష్టిగా సత్తా చూపిస్తే 2018-19 ఫలితం మళ్లీ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, సెలక్షన్ కమిటీ తీసుకున్న కెప్టెన్సీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు.

Also Read: ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?

Click on your DTH Provider to Add TV9 Telugu