పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఘోరంగా ఓడిన టీమిండియా..

అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 90 పరుగుల టార్గెట్‌ను

పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఘోరంగా ఓడిన టీమిండియా..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 1:41 PM

India Vs Australia 2020: పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో ఇప్పటిదాకా ఆడిన 8 డే/నైట్ టెస్టుల్లోనూ ఆసీస్ అన్నింటిలోనూ విజయం సాధించింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్.. ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను సునాయాసంగా చేధించారు. ఓపెనర్ బర్న్స్(51*) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ వేడ్(33) రాణించాడు. ఇక భారత్ బౌలర్లలో అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది.

కాగా, అంతమందు 9/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా.. మరో 27 పరుగులు జోడించి 36 రన్స్‌కు ఆలౌట్ అయింది. టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్ ఐదు వికెట్లు, కమ్మిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244, ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి విదితమే. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టిమ్ పైన్‌కు దక్కింది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..