గాడిద పాల పరిశ్రమ.. లీటర్ పాల ధర రూ.7 వేలు

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు..  ఇందులో ఎంత నిజం ఉన్నా.. ఇప్పటి మార్కెటింగ్ యుగంలో అస్సలు సరిపోయేట్లు

గాడిద పాల పరిశ్రమ.. లీటర్ పాల ధర రూ.7 వేలు
Follow us

|

Updated on: Aug 10, 2020 | 2:15 PM

India to Soon Get Dairy For Donkey Milk : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు..  ఇందులో ఎంత నిజం ఉన్నా.. ఇప్పటి మార్కెటింగ్ యుగంలో అస్సలు సరిపోయేట్లు లేదు. ఇప్పుడు గోవు పాల కంటే ఖరము పాలు.. అంటే గడిద పాలు ఎక్కువ ధరను పలుకుతున్నాయి. ఇది గుర్తించిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ ఓ గాడిద పాల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

మనకు ఆవు, గేదె, మేక, ఒంటే పాల డెయిరీలను మాత్రమే చూశాము.. అయితే.. త్వరలో హర్యానా హిస్సార్‌లో గాడిదల పాల డెయిరీని ఎన్‌ఆర్‌సీఈ ప్రారంభించనుంది. హిసార్‌లోని ఎన్‌ఆర్‌సీఈ(NRCE) హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో డెయిరీని తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం గుజరాత్ లభించే హలారి జాతి గాడిదలను గుర్తించింది. ఇందు కోసం పది హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్‌ చేసింది.

గుజరాత్‌లో కనిపించే హలారి జాతి గడిద పాలలో ఔషధాల నిధిగా గుర్తించారు. హలారి గాడిద పాలకు క్యాన్సర్‌, ఊబకాయం, అలర్జీ మొదలైన వ్యాధులపై పోరాడే సామర్థ్యం ఉందంటున్నారు ఎన్‌ఆర్‌సీఈ.  గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. గాడిద పాలపై పరిశోధన కార్యక్రమాన్ని ఎన్ఆర్‌సీఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ ఆర్ త్రిపాఠి ప్రారంభించారు. ఒక లీటర్ గాడిద పాలు మార్కెట్లో రూ.2000 నుంచి రూ.7000 వరకు ధర పలుకుతోంది. గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అంతే కాదు వీటికి చాలా ఖరీదుకూడా ఎక్కువే… గాడిద పాలను సబ్బులు, లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు తదితర వాటిని తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు.