ఐదో టీ20: క్లీన్ స్వీప్ చేస్తే సూపర్ రికార్డు

టీమిండియా విక్టరీలతో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నది… న్యూజిలాండ్‌తో రేపు జరిగే చివరి టీ-20లో కూడా గెలిస్తే ఓ పనై పోతుంది… అసలు న్యూజిలాండ్‌లో విజయాలు ఇంత ఈజీగా వస్తాయని ఎవరూ అనుకోలేదు.. ఎందుకంటే టీ-20లలో న్యూజిలాండ్‌ రికార్డు అలా ఉంది మరి! ఆదివారం బే ఓవల్‌లో జరిగే చివరి వన్డేలో ఇండియాదే ఘనమైన రికార్డు కోసం ఆరాటపడుతుంటే.. న్యూజిలాండేమో చెత్త రికార్డును తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తుంది.. నిజానికి గత రెండు మ్యాచులలో విజయానికి చేరువలోకి వచ్చి ఆఖరి […]

ఐదో టీ20: క్లీన్ స్వీప్ చేస్తే సూపర్ రికార్డు
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 7:22 PM

టీమిండియా విక్టరీలతో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నది… న్యూజిలాండ్‌తో రేపు జరిగే చివరి టీ-20లో కూడా గెలిస్తే ఓ పనై పోతుంది… అసలు న్యూజిలాండ్‌లో విజయాలు ఇంత ఈజీగా వస్తాయని ఎవరూ అనుకోలేదు.. ఎందుకంటే టీ-20లలో న్యూజిలాండ్‌ రికార్డు అలా ఉంది మరి! ఆదివారం బే ఓవల్‌లో జరిగే చివరి వన్డేలో ఇండియాదే ఘనమైన రికార్డు కోసం ఆరాటపడుతుంటే.. న్యూజిలాండేమో చెత్త రికార్డును తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తుంది..

నిజానికి గత రెండు మ్యాచులలో విజయానికి చేరువలోకి వచ్చి ఆఖరి దశలో ఓడిపోయింది న్యూజిలాండ్… కనీసం చివరి మ్యాచ్‌నైనా కాపాడుకుని కాసింత పరువు నిలుపుకుందామనుకుంటోంది… న్యూజిలాండ్‌ గడ్డపై టీ-20 సిరీస్‌ను ఇండియా గెలవడం ఇదే మొదటిసారి.. 2009లో 0-2తో ఓడిపోయిన ఇండియా లాస్టియర్‌ 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది.. ఈసారి మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెల్చుకుని వారెవ్వా అనిపించుకుంది..ఒకవేళ రేపటి మ్యాచ్‌లోనూ ఇండియా గెలిస్తే అదో రికార్డవుతుంది..

న్యూజిలాండ్‌లో అయిదు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ ఇంతవరకు లేదు.. ఆ క్రెడిట్‌ భారత్‌కు సొంతమవుతుంది.. అలాగే న్యూజిలాండ్ కూడా ఇలా అయిదు టీ-20లను ఎప్పుడూ ఓడిపోలేదు.. గాయం కారణంగా నాలుగో వన్డేలో ఆడని కేన్‌ విలియమ్స్‌ రేపటి మ్యాచ్‌కు రెడీ అయ్యాడు.. అచ్చొచ్చిన స్టేడియంలో అడటం న్యూజిలాండ్‌కు కలిసివచ్చే మరో అంశం… ఇక్కడ ఇప్పటి వరకు న్యూజిలాండ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడింది.. ఇందులో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది.. ఒక మ్యాచ్‌లో రిజల్ట్‌ రాలేదు.. -బాలు

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన