యూకేలో కొత్త మ్యుటెంట్ వైరస్ ఎఫెక్ట్, బ్రిటన్ కి విమాన సర్వీసులపై నిషేధం జనవరి 7 వరకు పొడిగింపు, ప్రభుత్వ నిర్ణయం

బ్రిటన్ లో శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త మ్యుటెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసుల తాత్కాలిక నిషేధాన్ని ప్రభుత్వం జనవరి 7 వరకు

యూకేలో కొత్త మ్యుటెంట్ వైరస్ ఎఫెక్ట్, బ్రిటన్ కి విమాన సర్వీసులపై నిషేధం జనవరి 7 వరకు పొడిగింపు, ప్రభుత్వ నిర్ణయం
refund
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 12:15 PM

బ్రిటన్ లో శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త మ్యుటెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసుల తాత్కాలిక నిషేధాన్ని ప్రభుత్వం జనవరి 7 వరకు పొడిగించింది. యూకే కి వెళ్లే, లేదా అక్కడి నుంచి వచ్ఛే విమానాల టెంపొరరీ సస్పెన్షన్ ని ఈ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. జనవరి 7 తరువాత పరిణామాలను గమనించి వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవలే యూకేకి  విమాన సర్వీసులపై నిషేధం డిసెంబరు 31 వరకు ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బ్రిటన్ నుంచి ఇండియాకు చేరుకున్న పలువురు భారతీయుల్లో కోవిడ్19 పాజిటివ్ లక్షణాలను గుర్తించినప్పటికీ వీరిలో కొందరికి మ్యుటెంట్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. ప్రాథమిక పరీక్షల అనంతరం 20 కేసుల్లో మ్యుటెంట్ వైరస్ లక్షణాల వైనం బయటపడింది. ఆరుగురు రోగుల్లో వీటిని  గుర్తించామని సర్కార్ నిన్న తెలిపింది. 8 కేసులను ఢిల్లీ ల్యాబ్, 7 కేసులను బెంగుళూరు ల్యాబ్ నమోదు చేశాయి. అయితే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు.

నవంబరు 25, డిసెంబరు 23 మధ్య తేదీల్లో  ఇండియాకు చేరుకున్న  సుమారు 33 వేలమందికి టెస్టులు నిర్వహించారు.   కాగా…. ఈ కొత్త మ్యుటెంట్ కరోనా వైరస్ ప్రమాదకరమైనదా, కాదా అన్నవిషయాన్ని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.