AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దశాబ్దాల నాటి అణు విధానంలో వ్యూహాత్మక మార్పు.. శత్రువులకు సింహస్వప్నంగా మారిన భారత్!

ప్రపంచ ఆయుధ పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదిక అంతర్జాతీయ రక్షణ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనా, పాకిస్తాన్ దేశాల నుండి పొంచి ఉన్న ద్విముఖ ముప్పును ఎదుర్కొనేందుకు భారతదేశం తన అణు వ్యూహంలో అత్యంత కీలకమైన, చారిత్రాత్మక మార్పులు చేసినట్లు సిప్రి వెల్లడించింది.

దశాబ్దాల నాటి అణు విధానంలో వ్యూహాత్మక మార్పు.. శత్రువులకు సింహస్వప్నంగా మారిన భారత్!
India Expands Nuclear Arsenal
Balaraju Goud
|

Updated on: Jun 09, 2026 | 3:37 PM

Share

ప్రపంచ ఆయుధ పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదిక అంతర్జాతీయ రక్షణ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనా, పాకిస్తాన్ దేశాల నుండి పొంచి ఉన్న ద్విముఖ ముప్పును ఎదుర్కొనేందుకు భారతదేశం తన అణు వ్యూహంలో అత్యంత కీలకమైన, చారిత్రాత్మక మార్పులు చేసినట్లు సిప్రి వెల్లడించింది. భారత రక్షణ చరిత్రలోనే మొదటిసారిగా, దేశం 12 అణ్వాయుధాలను కార్యాచరణ సన్నద్ధతతో (Operational Deployment) మోహరించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

గత కొన్నేళ్లుగా శాంతికాలంలో భారతదేశం తన అణ్వాయుధాలను (Warheads), వాటిని ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాల నుండి వేరువేరుగా భద్రపరుస్తుందని అంతర్జాతీయంగా బలమైన నమ్మకం ఉండేది. కానీ సిప్రి తాజా నివేదిక ఈ వాదనను తిరస్కరించింది. ప్రస్తుతం భారతదేశం కొన్ని అణ్వాయుధాలను వాటి ప్రయోగ వ్యవస్థలతో నేరుగా అనుసంధానించి, తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. శత్రుదేశాలు ఏదైనా అనాలోచిత అణుదాడికి తెగబడితే, సెకన్ల వ్యవధిలోనే శత్రువు సర్వనాశనం అయ్యేలా తక్షణ ప్రతీకార దాడి చేసే సామర్థ్యాన్ని భారత్ సాధించిందని నివేదిక విశ్లేషించింది.

సిప్రి నివేదిక ప్రకారం, జనవరి 2026 నాటికి భారతదేశం వద్ద మొత్తం అణ్వాయుధాల సంఖ్య 190 కి చేరింది. ఇందులో 12 అణ్వాయుధాలు క్షిపణులు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలలో ఎల్లప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. క్షిపణులను క్యానిస్టర్లలో నిల్వ చేయడం, సముద్ర గస్తీని పెంచడం ద్వారా భారత్ ఈ సంసిద్ధతను సాధించింది. కాగా, పొరుగు దేశమైన పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, వాటిలో ఏ ఒక్కటి కూడా ప్రస్తుతానికి రైడీ టు ఫైర్ స్థితిలో లేవని సిప్రి తెలిపింది. పాకిస్తాన్ కంటే వేగంగా భారత్ అణు సామర్థ్యాన్ని ఆధునీకరిస్తోందని పేర్కొంది.

సముద్ర గర్భంలో అణు రక్షణ కవచాలు

భారతదేశానికి చెందిన “మొదట వాడకూడదు” (No First Use) అనే అణు విధానానికి అనుగుణంగా సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ ఇటీవల 2024 ఆగస్టు నుండి ఐఎన్ఎస్ అరిఘాట్ (INS Arighat), ఐఎన్ఎస్ అరిదమన్ (INS Aridaman) అనే రెండు అత్యాధునిక అణు సామర్థ్యం గల జలాంతర్గాములను రంగంలోకి దించింది. ఇవి వ్యూహాత్మక అణు క్షిపణులను మోస్తూ, సుదూర సముద్ర గర్భంలో నెలల తరబడి ఉంటూ నిరోధక గస్తీ నిర్వహిస్తున్నాయి.

అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల రికార్డు స్థాయి ఖర్చు

ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ICAN) నివేదిక ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల ఆధునీకరణపై ఏకంగా 119 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి వ్యయం జరిగింది.

వివిధ దేశాల అణు బడ్జెట్ ఖర్చులు (బిలియన్ డాలర్లలో):

అమెరికా  69.2 బిలియన్ డాలర్లు
చైనా 13.5 బిలియన్ డాలర్లు
యునైటెడ్ కింగ్‌డమ్ 12.6 బిలియన్ డాలర్లు
రష్యా 9.5 బిలియన్ డాలర్లు
ఫ్రాన్స్ 7.7 బిలియన్ డాలర్లు
భారతదేశం 2.8 బిలియన్ డాలర్లు
పాకిస్తాన్ 1.5 బిలియన్ డాలర్లు
ఇజ్రాయెల్   1.2 బిలియన్ డాలర్లు
ఉత్తర కొరియా 656 మిలియన్ డాలర్లు

ఈ గ్లోబల్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, ప్రపంచ దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు అణ్వాయుధాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే భారతదేశం కూడా తన వ్యూహాత్మక రక్షణను పటిష్టం చేసుకుంటూ గ్లోబల్ పవర్ హౌస్‌గా ఎదుగుతోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us