దేశంలో 73 లక్షలు దాటేసిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.  కొత్తగా 67,708 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 73,07,098 చేరినట్లు కేంద్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

దేశంలో 73 లక్షలు దాటేసిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Oct 15, 2020 | 10:46 AM

దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.  కొత్తగా 67,708 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 73,07,098 చేరినట్లు కేంద్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా మరో 680 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,11,266 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,12,390 కోలుకోగా..మొత్తం రికవరీల సంఖ్య 63లక్షల 83వేల 442కు పెరిగింది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 11,36,183 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ( జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ )

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తతం దేశంలో రికవరీ రేటు  87.36% ఉండగా, డెత్ రేటు 1.52% గా ఉంది. ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అమెరికా ఫస్ట్ ప్లేసులో ఉంది. అయితే రోజువారి నమోదయ్యే కేసుల విషయంలో మాత్రం భారత్ మొదటి స్థానంలో ఉంది.