వన్డే, టెస్ట్ సిరీస్‌లకు రోహిత్ దూరం.. మయాంక్‌కు చోటు!

IND Vs NZ: కివీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీనితో అతను మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం రోహిత్ […]

వన్డే, టెస్ట్ సిరీస్‌లకు రోహిత్ దూరం.. మయాంక్‌కు చోటు!

IND Vs NZ: కివీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీనితో అతను మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేదని.. ఫిజియో సూచనల మేరకు అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మయాంక్‌ అగర్వాల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌లు ముందు వరుసలో ఉన్నారు. అయితే టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా అద్భుత ఫామ్ కొనసాగించడంతో పృథ్వీ షాతో కలిసి ఓపెనింగ్ దిగడం ఖాయంలా కనిపిస్తోంది. కాగా, ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ నెల 5వ తేదీ నుంచి మొదలు కానుంది.

Published On - 4:05 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu