రాష్ట్రంలో మండిపోతున్న కూరగాయల ధరలు.. హైదరాబాద్ ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఈ విధంగా ఉన్నాయి..

లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు, ఉపాధి పోయి గ్రామాలకు వెళ్లిన వలస కుటుంబాలు నెమ్మదిగా పల్లెల నుంచి పట్నం దారిన పడుతున్నాయి.

  • uppula Raju
  • Publish Date - 10:45 am, Wed, 30 December 20
రాష్ట్రంలో మండిపోతున్న కూరగాయల ధరలు.. హైదరాబాద్ ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఈ విధంగా ఉన్నాయి..

లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు, ఉపాధి పోయి గ్రామాలకు వెళ్లిన వలస కుటుంబాలు నెమ్మదిగా పల్లెల నుంచి పట్నం దారిన పడుతున్నాయి. చిన్నా చితక పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న వీళ్లకు కూరగాయల రేట్లు దడ పుట్టిస్తున్నాయి. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి లెక్కన మారాయి. వీటికి తోడు శీతాకాలం కావడంతో మార్కెట్‌కు సైతం కూరగాయలు తక్కువగా వస్తున్నాయి. అకాల వర్షాలు, తుఫాన్‌ల వల్ల పంటలు నష్టపోయి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కూరగాయల పంటలు తక్కువగా వేయడం వల్ల రేట్లు మండిపోతున్నాయి.

‘హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయల రేట్లు ఈ విధంగా ఉన్నాయి. టమాట లోకల్ మార్కెట్‌లో రూ.22 ఉంటే రైతుబజార్‌లో రూ.20 గా ఉంది.వంకాయలు రూ.42, 40, బెండకాయలు రూ.42,40, పచ్చిమిర్చి రూ. 42, 40, కాకరకాయ రూ.52,50, కాలిఫ్లవర్ రూ.32,30, క్యాబేజీ రూ.32,30, క్యారెట్ రూ.52,50, దొండకాయ రూ.34,32, ఆలుగడ్డ రూ.34,32, ఉల్లిగడ్డ రూ.42,40, దోసకాయ రూ.30,32, బీన్స్ రూ.52,50, చామగడ్డ రూ.42,40, ములక్కాడ 62,60, బీట్ రూట్ రూ.52,50, కీర రూ.42,40లుగా ఉన్నాయి.