ఐటీ రిటర్న్‌కి గడువు మూడు రోజులే.. చేయలేదో..!

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులు సమర్పించేందుకు గడువు ముంచుకొస్తోంది. గత నెల జూలై 31నే చివరి తేదీ కాగా.. దానిని ఆగస్ట్ 31 వరకు పొడిగించారు. అయితే ఇప్పుడు ఐటీ ఫైలింగ్ చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలిఉంది. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నా యి. వీటిలో ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ తో పాటుగా.. మరో నాలుగు కూడా ఉన్నాయి. క్లియర్‌ ట్యాక్స్, […]

ఐటీ రిటర్న్‌కి గడువు మూడు రోజులే.. చేయలేదో..!
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 7:58 PM

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులు సమర్పించేందుకు గడువు ముంచుకొస్తోంది. గత నెల జూలై 31నే చివరి తేదీ కాగా.. దానిని ఆగస్ట్ 31 వరకు పొడిగించారు. అయితే ఇప్పుడు ఐటీ ఫైలింగ్ చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలిఉంది. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నా యి. వీటిలో ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ తో పాటుగా.. మరో నాలుగు కూడా ఉన్నాయి. క్లియర్‌ ట్యాక్స్, మై ఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్‌ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ-ఫైలింగ్‌ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. అయితే ఆగస్ట్ 31 దాటితే.. భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. డిసెంబర్‌లోగా ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు.