రేపిస్టులకు బహిరంగ ఉరి.. పాక్ పార్లమెంట్ సంచలన నిర్ణయం

Pakistan Parliament: చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీసేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకించగా.. మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో మెజార్టీ ఓట్లతో పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయింది. కాగా, 2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ […]

రేపిస్టులకు బహిరంగ ఉరి.. పాక్ పార్లమెంట్ సంచలన నిర్ణయం
Ravi Kiran

| Edited By: Srinu Perla

Feb 08, 2020 | 3:17 PM

Pakistan Parliament: చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీసేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకించగా.. మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో మెజార్టీ ఓట్లతో పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయింది.

కాగా, 2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్థాన్‌లో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు పాక్‌కు చెందిన పిల్లల హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది. దీనితో మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోగా.. దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ తీర్మానాన్ని ఆమోదించడంలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని.. శిక్షల తీవ్రతను పెంచినంత మాత్రాన నేరాలు తగ్గిపోవని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత రాజా పార్వైజ్ అన్నారు. అటు వివాదాస్పద మంత్రి ఫాద్ చౌదరి కూడా ట్విట్టర్ ద్వారా ఈ తీర్మానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నాగరికం కాని సమాజంలో ఇది ఓ అనాగరికమైన చర్య’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu