అత్తింటి మర్యాదా మజాకా.. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడికి ఏకంగా 125 వంటకాలు వండించారు.. ఎక్కడంటే..

అత్తింటి మర్యాదా మజాకా.. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడికి ఏకంగా 125 వంటకాలు వండించారు.. ఎక్కడంటే..

సంక్రాంతి పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధరణంగా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‏లో సంక్రాంతి పండుగను

Rajitha Chanti

|

Jan 18, 2021 | 2:44 PM

సంక్రాంతి పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధరణంగా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‏లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండగ మాత్రమే కాదండోయ్.. ఇంటికి వచ్చిన వారికి అక్కడి వారు చేసి మర్యాదలు కూడా మాములుగా ఉండవు. కమెడియన్ సునిల్ హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమాలో చూపించినట్లుగా రాయలసీమ అంటేనే మర్యాదకు మారుపేరు అనే విషయం తెలిసిందే. అలాగే రాయలసీమలోనే కాకుండా గోదావరి జిల్లాల్లోని వారు మర్యాదలకు ఏ మాత్రం తీసిపోరు. ఇక కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదల గురించి చెప్పాల్సిన పనేలేదు. తాజాగా సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వండించారు. ఆ 125 రకాల వంటకాల్లో అన్ని రుచులు ఉండేలా చూసుకున్నారు. స్వీట్స్, హాట్, పండ్లు, బర్గర్లు, కూరగాయల వంటలు, రకారకాల రైస్‏లు మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దారు. ఈ 125 రకాల వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది. ఇక వాటి ముందు అల్లుడు, కూతురు కూర్చోని ఆ వంటకాలు రుచి చూస్తూ ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

పండక్కి వచ్చిన అల్లుడు తమ అత్తింటి వారు పెట్టిన అన్ని రకాల వంటలను చూసి ఒకింత ఆశ్చర్యానికి.. వాళ్ళ మర్యాదకు సంతోషపడినట్లుగా కనిపిస్తున్నాడు. తనతోపాటు తన భార్యను కూడా కొంచెం టేస్ట్ చేయమని స్పూన్‏తో అందించగా.. నాకొద్దు అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ అత్తింటి వారి మర్యాదకు రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగినట్లుగా సమచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu