పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్ అడిక్ట్, మాజీ బౌలర్ సర్ ఫరాజ్ నవాజ్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకునేవారని మాజీ బౌలర్ సర్ ఫరాజ్ నవాజ్ షాకింగ్ ప్రకటన చేశాడు. 1987 లో ఇమ్రాన్ కొకైన్  తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఓ వీడియోలో పేర్కొన్నాడు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్ అడిక్ట్, మాజీ బౌలర్ సర్ ఫరాజ్ నవాజ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 1:48 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకునేవారని మాజీ బౌలర్ సర్ ఫరాజ్ నవాజ్ షాకింగ్ ప్రకటన చేశాడు. 1987 లో ఇమ్రాన్ కొకైన్  తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఓ వీడియోలో పేర్కొన్నాడు. (1970, 1980 ప్రాంతాల్లో నవాజ్, ఇమ్రాన్ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లు). తను చెప్పింది అబధ్ధమైతే ఇమ్రాన్ తనను కోర్టుకు లాగవచ్చునన్నాడు. 1987 లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సరిగా బౌలింగ్ వేయలేయపోయిన ఇమ్రాన్.. ఇస్లామాబాద్ లోని తన ఇంటికి వచ్చి..కొకైన్ తీసుకున్నాడని సర్ ఫరాజ్ గుర్తు చేశాడు. పైగా లండన్ లో కూడా ఆయన డ్రగ్స్ తీసుకోవడాన్ని మొహిసిన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, సలీం మాలిక్ కూడా చూశారని ఆ మాజీ బౌలర్ చెప్పాడు.