జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశం

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా రెడీ అవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. కరోనా నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం సబార్డినేట్ అధికారులతోను, జీహెచ్ఎంసీ అధికారులతోను...

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశం
Follow us

|

Updated on: Nov 05, 2020 | 6:37 PM

Important orders on GHMC elections by State Election Commissioner: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా రెడీ అవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. కరోనా నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం సబార్డినేట్ అధికారులతోను, జీహెచ్ఎంసీ అధికారులతోను సంయుక్తంగా సమావేశమైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనున్నందున.. ఆలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 7వ తేదీన ప్రచురించాలని, తుది జాబితా 13వ తేదీన ప్రచురించాలని ఆదేశించారు ఎలెక్షన్ కమిషనర్. తుది జాబితా ప్రచురించిన తరువాత కూడా ఓటరుగా నమోదు చేసుకోని వారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు ఎప్పుడైనా సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌కు ఆన్‌లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

అదనపు కలెక్టర్లను డిప్యుటీ ఎలక్షన్ అథారిటీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసామని, కోవిడ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొనేలా విశాలమైన గదులు ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారులతో సంప్రదించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో వేయి మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. వేయి లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను.. వేయికి మించి ఓటర్లు ఉన్న కేంద్రాలలో నలుగురు పోలింగ్ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను 2016 ఎన్నికల్లో అమలు చేసిన విధంగానే ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ అధికారుల సహకారంతో బందోబస్తు ప్లాన్ తయారు చేయాలని, ఎంసీసీ, స్టాటిక్ సర్వేలెన్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను గుర్తించాలన్నారు. బ్యాలట్ బాక్సులను సురక్షితంగా భద్రపరిచేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల కొరకు అనువైన ప్రాంతాలను గుర్తించి కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిమిత్తం 5 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయరాదన్నారు స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ పార్థసారథి.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం

ALSO READ: వండర్ కలెక్టర్ టీచరైన వేళ!