బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

బందరు పోర్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో మచిలీపట్నం పోర్టుపై వచ్చిన...

బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Nov 05, 2020 | 5:43 PM

Important decision on Bunder port: బందరు పోర్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో మచిలీపట్నం పోర్టుపై వచ్చిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను మంత్రి వర్గం పరిశీలించింది. మచిలీపట్నం (బందరు) పోర్టు నిర్మాణానికి 5 వేల 700 కోట్ల రూపాయల వ్యయం కాగలదన్న డీపీఆర్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది.

మచిలీపట్నం పోర్టు అంశంతోపాటు పలు కీలకాంశాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. పలు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 30 అంశాలపై మంత్రివర్గం సమాలోచనలు జరిపినట్లు సమాచారం. చిరువ్యాప్యారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్న చేదోడు పథకాన్ని మంత్రివర్గం రాటిఫై చేసింది. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులివ్వాలని నిర్ణయించిన కేబినెట్.. వారికి సున్నా వడ్డీతో పది వేల రూపాయల వరకు రుణం ఇవ్వాలని తీర్మానించింది.  ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అర్హులకు, లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసే విషయంలో అధ్యయనం చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇసుక పాలసీపై మంత్రివర్గం చర్చించిందని సమాచారం. కొత్త ఇసుక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించింది.

రాష్ట్రంలో భూములపై పున:సర్వే నిర్వహించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశాల తేదీలపై కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: చంద్రబాబు ఆరోపణ తప్పని తేల్చిన కేబినెట్

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: వండర్ కలెక్టర్ టీచరైన వేళ!

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం