Indian Economy: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. భారత్ వృద్ధి రేటు అంచ‌నాను కుదించిన ఐఎంఎఫ్‌..

IMF on Indian Economy: కరోనా మహమ్మారి నాటి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. 2020 నాటినుంచి అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. అయితే..

Indian Economy: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. భారత్ వృద్ధి రేటు అంచ‌నాను కుదించిన ఐఎంఎఫ్‌..
IMF on Indian Economy
Follow us

|

Updated on: Jul 27, 2021 | 7:57 PM

IMF on Indian Economy: కరోనా మహమ్మారి నాటి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. 2020 నాటినుంచి అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో మార్చి-మేలో భార‌త ఆర్ధిక వ్యవస్థ రిక‌వ‌రీకి విఘాతం క‌ల‌గిన విషయం తెలిసిందే. దీంతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఐఎంఎఫ్ వృద్ధి రేటులో మూడు శాతం కోత కొత విధించింది. ఇప్పుడు ఆ వృద్ది అంచ‌నాను 9.5 శాతానికి ప‌రిమితం చేసింది. కోవిడ్19 సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా వృద్ధి రేటు అంచ‌నాను డౌన్‌గ్రేడ్ చేసిన‌ట్టు ఐఎంఎఫ్ పేర్కొంది. అంత‌కుముందు 2022 ఆర్ధిక సంవత్సరంలో భార‌త వృద్ధిరేటు 12.5 శాతం ఉంటుంద‌ని ఐఎంఎఫ్ అంచ‌నా వేసిన సంగతి తెలిసిందే.

అయితే.. మార్చి-మే నెలల్లో కరోనా మ‌హ‌మ్మారి తీవ్రత కార‌ణంగా ఆర్థిక వ్యవస్థ రిక‌వ‌రీ ప్రక్రియ మంద‌గించింద‌ని ఐఎంఎఫ్ పేర్కొంది. సెకండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తితో ఆరోగ్య మౌలిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని వెల్లడించింది. మందుల లభ్యత అడుగంట‌డం, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, బెడ్ల కొర‌తతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అంత‌ర్జాతీయ‌ వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ త‌న అంచ‌నాలో పేర్కొంది. అయితే ఆశించిన దానికంటే.. వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మంద‌కొడిగా సాగుతోంద‌ని ఐఎంఎఫ్ ఆందోళ‌న వ్యక్తంచేసింది. అమెరికాకు చెందిన ఐఎంఎఫ్ సంస్థ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు, వృద్ధిరేటు గురించి అంచనాలను ప్రకటిస్తూ ఉంటుంది.

Also Read:

AP Debts: ఏపీ సర్కార్ అప్పులపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన.. ఎలాంటి మదింపు చేయలేదని స్పష్టం

నరమాంస భక్షకులు.. మృతదేహాన్ని పీక్కుతిని.. పుర్రెతో నృత్యాలు చేసిన మాంత్రికులు..