బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెను తుఫానుగా మారే అవకాశం..

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెను తుఫానుగా మారే అవకాశం..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 11:24 AM

Cyclonic storm: ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దాని ప్రభావంతో రేపు (ఈ నెల 15వ తేదీన) దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించింది.

కాగా.. ఈ నెల 15 తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ తుఫానుకు ‘ఎంఫాన్’ అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఎండలు మండుతున్న సమయంలో వర్షాలు పడితే ఉపశమనమనే చెప్పాలి. గతవారం కూడా హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరు జల్లులు పలకరించాయి.

[svt-event date=”14/05/2020,11:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!