వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ భారత్‌లోనే..!

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ భారత్‌లోనే..!

కరోనా వైరస్ దెబ్బతో అన్ని ప్రముఖ టోర్నమెంట్లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20  ప్రపంచకప్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 2:59 PM

ICC Gives Clarity On T20 World Cups Schedule: కరోనా వైరస్ దెబ్బతో అన్ని ప్రముఖ టోర్నమెంట్లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20  ప్రపంచకప్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనితో వరుసగా 2021, 2022ల్లో రెండు వరల్డ్ కప్ టోర్నీలు జరగనున్నాయి. ఇక ఈ ప్రపంచకప్ షెడ్యూల్స్‌పై తాజాగా ఐసీసీ కీలక ప్రకటన చేసింది.

ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకకూడా లో ఆస్ట్రేలియా వేదిక నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అటు వచ్చే ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుందని తెలిపింది. ఇక 2021లో జరగాల్సిన విమెన్స్ వరల్డ్ కప్‌ను 2022కు వాయిదా వేసింది. అటు 2023లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది.

Also Read: ‘అల దుబాయ్’లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu