టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌ ఎవరు..బ్రాడ్ ఆన్సర్ వింటే నవ్వాగదు..

కివీస్‌తో జరిగిన 5వ టీ20లో దూబే చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒక ఓవ‌ర్‌లో ఏకంగా 34 ప‌రుగులు ఇచ్చిన దూబే..టీ20లలో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా వరస్ట్ రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు ఇండియా తరుఫున ఏ ఫార్మాట్‌లో చూసినా అత్యధిక పరుగులు ఇఛ్చిన బౌలర్‌గా కూడా అతడే.  న్యూజిలాండ్‌ బ్యాటింగ్ చేస్తుండగా దూబే 10 వ ఓవర్ వేయడానికి బరిలోకి దిగాడు. ఆ టైమ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు రఫ్ […]

టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌ ఎవరు..బ్రాడ్ ఆన్సర్ వింటే నవ్వాగదు..

కివీస్‌తో జరిగిన 5వ టీ20లో దూబే చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒక ఓవ‌ర్‌లో ఏకంగా 34 ప‌రుగులు ఇచ్చిన దూబే..టీ20లలో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా వరస్ట్ రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు ఇండియా తరుఫున ఏ ఫార్మాట్‌లో చూసినా అత్యధిక పరుగులు ఇఛ్చిన బౌలర్‌గా కూడా అతడే.  న్యూజిలాండ్‌ బ్యాటింగ్ చేస్తుండగా దూబే 10 వ ఓవర్ వేయడానికి బరిలోకి దిగాడు. ఆ టైమ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు రఫ్ ప్లేయర్స్  టిమ్‌ సీఫెర్ట్‌, రాస్‌ టేలర్‌ గ్రౌండ్‌లో ఉన్నారు. ఇంకేముంది యువ భారత్ బౌలర్‌పై విరుచుకుపడిన ఈ ద్వయం..’6, 6 , 4 ,1 , 4నోబ్‌, 6, 6లతో కలిపి మొత్తం 34 ప‌రుగులు రాబట్టుకుంది.

దూబే ప్రదర్శన అనంతరం..ఐసీసీ సోషల్ మీడియాలో ఓ సరదా ప్రశ్న వేసింది. టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన  బౌలర్‌ ఎవరో గుర్తున్నారా?’ అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. దీనికి స్టువర్డ్ బ్రాడ్ కూడా అంతే సరదాగా ఆన్సర్ ఇచ్చాడు. “నాకు తెలీదు” అని కామెంట్ పెట్టాడు.  2007 టీ20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌కు భారత మాజీ ప్లేయర్ యువరాజ్‌ సింగ్‌ మరిచిపోలేని అనుభవాన్ని మిగిల్చాడు. ఒక ఓవర్..6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి 36 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులతో పాటు ఎక్స్‌ట్రాస్ ఇస్తే మాత్రమే ఈ రికార్డు చెరిగిపోతుంది. ఇక టీ20 హిస్టరీలో   ఎక్కువ పరుగులు ఇచిన భారత్ బౌలర్స్‌లో స్టువ‌ర్ట్ బిన్నీ( 32 పరుగులు) సెకండ్ ప్లేసులో.. సురేశ్ రైనా (26 ప‌రుగులు) థర్డ్ ప్లేసులో ఉన్నారు.

 


Published On - 1:09 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu