సొంత ఛాపర్​​ కూల్చివేత: ఆరుగురిపై ఐఏఎఫ్​ చర్యలు!

సొంత ఛాపర్​​ కూల్చివేత: ఆరుగురిపై ఐఏఎఫ్​ చర్యలు!

ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్​నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్​కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అసలేం జరిగింది : బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనంతరం భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిబ్రవరి 27న జరిగిన […]

Ram Naramaneni

|

Oct 15, 2019 | 3:18 AM

ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్​నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్​కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం.

అసలేం జరిగింది :

బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనంతరం భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిబ్రవరి 27న జరిగిన చాపర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆ చాపర్‌ను కూల్చేసింది భారత వైమానిక దళ క్షిపణి అని తేలింది. హెలికాప్టర్ ఎగిరిన 12సెకన్లకే ప్రమాదవశాత్తు దీనిని కూల్చేసినట్లు తేలింది. ఫిబ్రవరి 27న చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆ ఎంఐ-17 హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురితో పాటు కింద ఉన్న ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగిన రోజున ఉదయం 10- 10.30 గంటల మధ్య పాకిస్థాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాలు సరిహద్దు రేఖను దాటి వచ్చాయి. అయితే వాటిలో ఎఫ్‌-16 విమానాలు కూడా ఉన్నాయి. భారత సైనిక స్థావరాల దిశగా ఆయుధాలను ప్రయోగించాయి. ఈ క్రమంలో వాటిని తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఎనిమిది యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. మరోవైపు కశ్మీర్‌ వ్యాప్తంగా వాయు రక్షణ దళం అప్రమత్తంగా ఉంది.

ఇదే సమయంలో శ్రీనగర్‌ విమానాశ్రయ వద్ద ఉన్న రాడార్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్‌ను గుర్తించాయి. అయితే అది మన వైమానిక దళానిదా? శత్రువులదా? అని గుర్తించడంలో పొరపాటు జరిగింది. ఆ ఛాపర్​​ రాడార్​ మన సైన్యానికి సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల శత్రువుదిగా భావించింది ఐఏఎఫ్​.  వెంటనే స్పైడర్​ క్షిపణి వ్యవస్థ ద్వారా ఛాపర్​ను క్షణాల్లో కూల్చివేసింది. ప్రమాద సమయంలో ఛాపర్​ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడుపుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu