కాంగ్రెస్ నేతకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బహిరంగ క్షమాపణలు, ఎందుకంటే ?

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2021 | 12:57 PM

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తమ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత ఇందిరా హృదయేష్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

కాంగ్రెస్ నేతకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బహిరంగ క్షమాపణలు, ఎందుకంటే ?

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తమ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత ఇందిరా హృదయేష్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ భగత్ ఆమె పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నేను అపాలజీ  చెబుతున్నా అన్నారు. అంతే కాదు.. ఆమెను వ్యక్తిగతంగా పిలిపించి నా విచారాన్ని తెలియజేస్తానన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఇందిరా హృదయేష్ ఉత్తరాఖండ్ ప్రతిపక్షనేత కూడా. భీమ్ టోల్ నియోహజకవర్గంలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన వంశీధర్ భగత్.. ఇందిరా హృదయేష్ ..వయస్సును, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ హేళన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీతో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై మనస్తాపం చెందిన ఇందిరా హృదయేష్… మహిళలపట్ల వంశీధర్ భగత్ కు గౌరవం లేదని, తనకన్నా వయస్సులో పెద్దదాన్నయిన తనను చులకన చేసి మాట్లాడారని అన్నారు. అది ఆయన చీప్ మెంటాలిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనే సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు.

Also Read :కరోనాతో బాధపడుతున్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. విషమించిన ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు. Also Read :నాడు ఇందిరా గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు బీజేపీ మోకాలడ్డు ? యూపీలో రేపు కాంగ్రెస్ సంవిధాన్ చర్చా దివస్ గా పాటింపు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu