తనకు అలానే ఇష్టమంటున్న బాలీవుడ్ బ్యూటీ

తనకు అలానే ఇష్టమంటున్న బాలీవుడ్ బ్యూటీ

తాను వేసిన దుస్తువులనే మళ్లీ మళ్లీ వేస్తుంటోంది బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్. పర్యావరణ కార్యకర్త అయిన తాను సుస్థిరమైన ఫ్యాషన్ స్టైల్..

Sanjay Kasula

|

Aug 11, 2020 | 6:56 PM

I Believe in Repeating Clothes Says Actress Bhumi : తాను వేసిన దుస్తువులనే మళ్లీ మళ్లీ వేస్తుంటోంది బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్. పర్యావరణ కార్యకర్త అయిన తాను సుస్థిరమైన ఫ్యాషన్ స్టైల్ నే నమ్ముతానంటోంది. చాలాసార్లు నేను ధరించే దుస్తులు రిపీట్ అవుతుంటాయని చెప్పుకొచ్చింది. నటిగా నన్ను కొత్త కొత్త డ్రెస్సులు, డిఫరెంట్‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌ లో చూడాలని కోరుకునే ఫ్యాన్స్.. నన్ను ఎప్పుడూ ఓకే దుస్తుల్లో చూస్తారని నేను అనుకోవడం లేదన్నారు.

కానీ నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటివేవి తను పట్టించుకోనంటోంది. తనకు చాలా రకాల వ్యాపారాలున్నాయని.. వాటిలో దుస్తులు అద్దెకు ఇచ్చే ఆలోచన అద్భుతమైనదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భూమి హిందీలో ‘దుర్గావతి’ చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది. భూమి పెడ్నేకర్‌ ‘క్లైమేట్‌ వారియర్’‌ పేరుతో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్‌ వార్మింగ్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తనవంతు సేవలందిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu