అర్థరాత్రి వేళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్ప్రైజ్ చెక్స్, ప్రత్యేక నిఘా పెట్టిన చంద్రాయణగుట్ట పోలీసులు
Police Surprise checks : హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అర్థరాత్రి సర్ప్రైజ్ చెక్స్ చేపట్టారు. బండ్లగూడ దగ్గర చాంద్రాయణగుట్ట పోలీసులు ఆకస్మిక..
Police Surprise Checks : హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అర్థరాత్రి సర్ప్రైజ్ చెక్స్ చేపట్టారు. బండ్లగూడ దగ్గర చాంద్రాయణగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బండ్లగూడ అదనపు సిఐ రవి వర్మ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. దొంగ వాహనాలు పై ఎవరైనా తిరుగుతున్నారా? అనే అనుమానంతో వాహనాల ధ్రువపత్రాలు చూస్తూ చెకింగ్స్ నిర్వహించారు. సరైన నెంబర్ ప్లేట్లు పెట్టని వాహనాలు, డ్రంకన్ డ్రైవ్, సౌండ్ పొల్యూషన్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తంగా రాత్రి తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు.