టీవీ9తో మొరపెట్టుకున్న తట్టి అన్నారం ప్రాంత వాసులు

హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ మండలం హనుమాన్ నగర్ కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తట్టి అన్నారం ప్రాంతంలో ఇళ్లన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. మా కష్టాలు తీర్చండి మొర్రో అంటూ కాలనీ వాసులు టీవీ9కి మొరపెట్టుకుంటున్నారు. “ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మా కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. నీటి మట్టాలు 7 అడుగులకు చేరుకున్నాయి. వార్డ్ కౌన్సిలర్, తహసీల్దార్ ఇరిగేషన్ ఏఈ, మా ప్రాంతాన్ని సందర్శించారు. అయినా ఇప్పటికీ తమ ఇళ్లు నీళ్లలోనే […]

టీవీ9తో మొరపెట్టుకున్న తట్టి అన్నారం ప్రాంత వాసులు
Follow us

|

Updated on: Oct 18, 2020 | 10:01 AM

హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ మండలం హనుమాన్ నగర్ కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తట్టి అన్నారం ప్రాంతంలో ఇళ్లన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. మా కష్టాలు తీర్చండి మొర్రో అంటూ కాలనీ వాసులు టీవీ9కి మొరపెట్టుకుంటున్నారు. “ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మా కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. నీటి మట్టాలు 7 అడుగులకు చేరుకున్నాయి. వార్డ్ కౌన్సిలర్, తహసీల్దార్ ఇరిగేషన్ ఏఈ, మా ప్రాంతాన్ని సందర్శించారు. అయినా ఇప్పటికీ తమ ఇళ్లు నీళ్లలోనే నానుతున్నాయి. నీటిపారుదల ఏఈ మీరు ఇళ్లు చెరువులో కట్టారని నిందించారు. వార్డ్ కౌన్సిలర్ తన వంతు సాయం చేస్తున్నప్పటికీ ఈ సమస్య అనేక విభాగాలతో సంబంధం కలిగి ఉండటంతో తమ కష్టాలు తీరటంలేదు. ఎవరూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడం లేదు. కాలనీ నివాసితులంతా తమ ఆశ్రయాన్ని కోల్పోయారు. తాత్కాలిక వసతిలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దయచేసి సమస్యను పరిశీలించండి. తాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తమ ఎమ్మెల్యే మమ్మల్ని కనీసం పరామర్శించలేదు” అంటూ ఆ ప్రాంత వాసులు వాపోతూ టీవీ9కి వెల్లడించారు.