Hyderabad: వైద్యం కోసం వెళితే.. వైద్యుడి వెకిలి చేష్టలు.. మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. చివరకు

ఓ డాక్టర్ మహిళ ప్రైవేట్​ పార్టులను తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఇదేంటని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షల్లో భాగమంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలు మందులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది.

Hyderabad: వైద్యం కోసం వెళితే.. వైద్యుడి వెకిలి చేష్టలు.. మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. చివరకు
Fake Doctor
Follow us

|

Updated on: Aug 10, 2022 | 1:24 PM

Hyderabad Doctor: ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడే కామంతో రగిలిపోయాడు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కామాంధుడి నేరం రుజువు కావడంతో ధర్మాసనం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధుస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో ఆరేళ్ల క్రితం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రోగిపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై వైద్యుడికి నాంపల్లి కోర్టు మంగళవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ.. ఊపిరితిత్తుల సమస్యతో 2016 మే 13 న హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర చెస్ట్ క్లినిక్‌కు రిఫర్ చేశారు. అనంతరం ఆమె ఆ ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో డాక్టర్​విజయభాస్కర్​వైద్య పరీక్షల పేరుతో గదిలోనికి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్​పార్టులను తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఇదేంటని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షల్లో భాగమంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలు మందులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో బాధితురాలు మళ్లీ హైదారబాద్‌కు తిరిగి వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్లి నిందితుడైన వైద్యుడిని సంప్రదించింది. చెకింగ్ సమయంలో డాక్టర్ మళ్లీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడంతో బాధితురాలు.. అతని దుర్భుద్దిని పసిగట్టింది.

అనంతరం.. బాధితురాలు, తన తల్లితో కలిసి వైద్యుడిపై గొడవకు దిగింది. ఆ తర్వాత.. ఆమె గోపాలపురం పోలీసులను ఆశ్రయించి డాక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాక్టర్ బాగోతం నిజమని తేలడంతో పోలీసులు విజయ్​కుమార్‌ను అరెస్ట్​చేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన నాంపల్లి సెషన్స్​కోర్టు జడ్జి కె.కవిత నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..