రవిప్రకాష్‌ కస్టడీపై కోర్టులో పిటిషన్..

రవిప్రకాష్‌  కస్టడీపై  కోర్టులో పిటిషన్..

నకిలీ ఈ మెయిల్ఐడీ  క్రియేట్ చేసిన  కేసులో టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్‌ను 10 రోజల కస్టడీకి అప్పగించాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది కూకట్‌పల్లి కోర్టు. ప్రస్తుతం రవిప్రకాష్ ఇదే కేసులో కూకట్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు. ఐ విజన్ కంపెనీకి చెందిన ఉద్యోగిగా నటరాజ్ పేరుమీద రవిప్రకాష్ నకిలీ ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 8:30 PM

నకిలీ ఈ మెయిల్ఐడీ  క్రియేట్ చేసిన  కేసులో టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్‌ను 10 రోజల కస్టడీకి అప్పగించాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది కూకట్‌పల్లి కోర్టు. ప్రస్తుతం రవిప్రకాష్ ఇదే కేసులో కూకట్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

ఐ విజన్ కంపెనీకి చెందిన ఉద్యోగిగా నటరాజ్ పేరుమీద రవిప్రకాష్ నకిలీ ఈ మెయిల్ ఐడీ తయారు చేశారని గుర్తించిన ఐ ల్యాబ్స్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన టీవీ9 ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌లకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో చంచల్‌గుడా జైలు ఉన్నారు. ఈ కేసులో రవిప్రకాష్‌కు బెయిల్ మంజూరైనా, నకిలీ ఐడీ కేసులో చంచల్‌గుడా జైలులోనే ఉండాల్సి వచ్చింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu