ఈనెలాఖరుకల్లా రోడ్డెక్కనున్న సీటీబస్సులు..?

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం అన్ని సేవలను నిలిపివేసింది. అన్ లాక్ ప్రక్రియలో భాగం ఈనెల 7వ తేదీన ప్రభుత్వం ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది. దీంతో త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.

ఈనెలాఖరుకల్లా రోడ్డెక్కనున్న సీటీబస్సులు..?
Follow us

|

Updated on: Sep 20, 2020 | 1:53 PM

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం అన్ని సేవలను నిలిపివేసింది. అన్ లాక్ ప్రక్రియలో భాగం ఈనెల 7వ తేదీన ప్రభుత్వం ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది. దీంతో త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ సీటీ బస్సులను కూడా తిప్పాలని భావిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసుల పునరుద్ధరణకు అధికారుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో ఇదే తరహాలో అమలు చేయాలని భావిస్తున్నారు. మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి తెచ్చే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన రూట్ల లో సర్వీసులు ముందుగా ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈనెల ఆఖరున సిటీ బస్సులు రోడ్డెక్కించాలని ఫ్లాన్ చేస్తున్నారు.

ఇక కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చాయి. దీంతో భాగ్యనగరంలోనూ తిప్పాలని భావిస్తున్నారు. భారీగా గండిపడ్డ ఖజానాను పూడ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. బస్సులు రోడ్డెక్కాక, కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించకపోవచ్చు. ప్రతి స్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తరువాతే బస్సులోకి ప్రయాణికులను సిబ్బంది అనుమతించేలా ఫ్లాన్ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బస్సులోకి అనుమతించకూడదని అధికారుల భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, ప్రయాణికులు ప్రతిఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని నింబంధనలు విధించారు.ఇక, ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచాలని హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు. త్వరలో ప్రభుత్వం అనుమతి రాగానే ఈ నెలాఖరుకల్లా సిటీ బస్సులు రోడ్డెక్కనున్నట్లు సమాచారం.

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు